IND Vs ENG | మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్‌కు టీమిండియా సన్నద్ధమవుతున్నది. ఐదుటెస్టుల సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకంజలో ఉన్నది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను నెగ్గాలని ఇంగ్లిష్ జట్టు తహతహలాడుతున్నది. టీమిండియా సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌పై పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నది. కనీసం మ్యాచ్‌ను డ్రాగా ముగించాలని చూస్తున్నది. అయితే, టీమిండియాకు ప్లేయర్స్ గాయాలు తలనొప్పిగా మారాయి. మాంచెస్టర్ టెస్ట్‌కు ముందే ఆల్ రౌండర్ నితీశ్ రెడ్డి, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయపడ్డారు. దాంతో టీమిండియా బౌలింగ్ విభాగం ఇబ్బందికరంగా మారింది.
ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో బుమ్రాస్థానంలో ఆకాశ్ దీప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మూడు టెస్టులో చోటు దక్కించుకున్నాడు. బుమ్రా అందుబాటులోకి వచ్చినా ఆకాశ్ దీప్‌కు సైతం తుది జట్టులో టీమ్ మేనేజ్మెంట్ చోటు కల్పించింది. లార్డ్స్ టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణను తప్పించింది. బుమ్రా ఈ సిరీస్‌లో కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడుతానని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిలో ఆటగాళ్ల గాయాల సమస్యలను పరిశీలిస్తే మాంచెస్టర్ టెస్టులో బుమ్రా అందుబాటులో ఉండడం ఖాయంగా కనిపిస్తున్నది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ సైతం బుమ్రా నాలుగో టెస్ట్ ఆడుతాడంటూ హింట్స్ ఇచ్చాడు.
నాలుగో టెస్టు సమయానికి ఆకాశ్ దీప్ ఫిట్‌గా లేకపోతే తుదిజట్టులో ఎవరికి చోటు కల్పిస్తారనే చర్చ సాగుతుంది. ప్రాక్టీస్ సెషన్లో ఆకాశ్ కొద్దిసేపు ప్రాక్టీస్ చేశాడు. అతని ప్లేస్‌లో తుదిజట్టులోకి వచ్చేందుకు ప్రసిద్ధ్ కృష్ణతో పాటు అన్షుల్ కాంబోజ్ పోటీపడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్లో ప్రసిద్ధ్ కృష్ణ, కాంబోజ్ ఇద్దరూ బౌలింగ్ సాధన చేశారు. కానీ, ఫిజియో ఆకాశ్‌ను నెట్ సెషన్లో బౌలింగ్ చేసేందుకు అనుమతించలేదు. కోచ్ మోర్నే మోర్కెల్ పర్యవేక్షణలో ప్రధాన మైదానంలో ఫిట్నెస్ను అంచనా వేశారు. ఆ తర్వాత నెట్ సెషన్లో ఒంటరిగా కనిపించాడు. అర్ష్‌దీప్ సింగ్ అతనితో కలిసి ఉన్నాడు. అర్ష్‌దీప్ చేతి గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు.
ఆకాశ్ దీప్ ఫిట్‌గా లేకపోతే టీమ్ మేనేజ్మెంట్ జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మూడో ఫాస్ట్ బౌలర్ కోసం ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కాంబోజ్‌లలో ఎవరో ఒకరిని తుదిజట్టులోకి తీసుకోవాల్సి ఉంటుంది. గాయపడిన అర్ష్‌దీప్ స్థానంలో కాంబోజ్ జట్టులోకి వచ్చాడు. దాంతో అతని అరంగేట్రంపై అవకాశాలు పెరిగాయి. కాంబోజ్.. శార్దూల్ ఠాకూర్‌తో కలిసి బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో శార్దూల్ ఠాకూర్ ఆడే ఛాన్స్ ఉంది. నెట్ సెషన్ సమయంలో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌తో పాటు పలువురు బ్యాట్స్మెన్లకు సిరాజ్ బౌలింగ్ వేశాడు. బుమ్రా మాత్రం మైదానంలో బౌలింగ్ సాధన చేశాడు. ప్రాక్టీస్ సెషన్లో పంత్ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌ను ప్రాక్టీస్ చేశాడు. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ తర్వాత స్లిప్ క్యాచ్‌ల ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేశాడు. పలు మ్యాచుల్లో క్యాచులు జారవిడిచిన నేపథ్యంలో ఫీల్డింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాడు.