ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్ కోసం అన్ని విధాలుగా తాము సిద్ధమైనట్లు టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. లీసెస్టర్‌షైర్‌తో వామప్ మ్యాచ్‌లో టీమిండియా మిడిలార్డర్ రాణించింది. కోహ్లీ సహా కీలకమైన ఆటగాళ్లంతా హాఫ్ సెంచరీలు సాధించారు. అనంతరం మాట్లాడిన ద్రావిడ్.. లీసెస్టర్షైర్లో గడిపిన వారం రోజులు చాలా బాగా గడిచాయని చెప్పాడు.
ఈ ప్రిపరేషన్ సమయంలో ఏమేం చేయాలని అనుకున్నామో అవన్నీ చేశామని, టెస్ట్ మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. గతంలో భారత్‌తో ఆడినప్పటితో పోలిస్తే.. ఈ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఫేవరెట్‌గా బరిలో దిగుతోంది. నెంబర్ వన్ టెస్టు జట్టు న్యూజిల్యాండ్‌ను 3-0తో చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్.. భారత్‌ను కూడా ఓడించేందుకు రెడీగా ఉంది.
అదే సమయంలో కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వస్తున్నట్లు కనిపిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇలా ఒకే ఒక మ్యాచ్ ఆడే సమయంలో మైదానంలో దిగినప్పటి నుంచే పరిణితితో ఆడాలని, తాము అదే చేయడానికి ప్రయత్నిస్తామని వివరించాడు. లీసెస్టర్షైర్లో పరిస్థితులు, తమకు దక్కిన ఆతిథ్యం అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. దీనికి సంబంధించిన వీడియోను లీసెస్టెర్‌షైర్ కౌంటీ క్లబ్ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.
🗣 | “𝐈𝐭 𝐰𝐚𝐬 𝐚 𝐠𝐫𝐞𝐚𝐭 𝐰𝐞𝐞𝐤.”@BCCI Head Coach 𝐑𝐚𝐡𝐮𝐥 𝐃𝐫𝐚𝐯𝐢𝐝 was full of praise for the week the side spent at Leicestershire, crediting the facilities, the wicket and the support from the crowd at UCG.
🦊#IndiaTourMatch | #LEIvIND | #TeamIndia pic.twitter.com/sNLyfFHmXH
— Leicestershire Foxes 🏏 (@leicsccc) June 27, 2022