England vs India | భారత్‌తో ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ మూడు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓలి పోప్ (100), హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌట్ అయ్యింది. యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ సెంచరీలతో కదం తొక్కగా.. కేఎల్ రాహుల్ 42 పరుగులు చేశాడు. వీరు మినహా మరే బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, బుమ్రా డకౌట్ అయ్యారు. జోష్ టంగ్, బెన్ స్టోక్స్‌కు చెరో నాలుగు వికెట్లు దక్కాయి. బ్రైడన్ కార్సే, షోయబ్ బషీర్ చెరో వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలోనే బుమ్రా షాక్ ఇచ్చాడు.
ఓపెనర్ జాక్ క్రాలే (4) అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ బెన్ డకౌట్, ఓలి పోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. డకెట్ 94 పరుగులు చేసిన బంతుల్లో 62 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు. మరో వైపు ఓలి పోప్ టీమిండియా బౌలింగ్‌ను సమర్థవంతంగా ఆడుతూ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత వెంటనే 206 పరుగుల వద్ద జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జో రూట్ (28 పరుగులు) అవుట్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతిని ఆడిన జో రూట్ స్లిప్‌లో కరుణ్ నాయర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మూడో వికెట్‌కు పోప్‌తో కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 58 బంతుల్లో రెండు ఫోర్ల సహాయంతో 28 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకే మూడు వికెట్ల దక్కాయి.