IND vs ENG | ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో మూడో టెస్టుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా సిద్ధమయ్యాడు. ఈ నెల 10 నుంచి లార్డ్స్ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్నది. ఈ మ్యాచ్‌లో బుమ్రా తిరిగి బరిలోకి దిగనున్నాడు. వర్క్‌లోడ్ కారణంగా బుమ్రా బర్మింగ్‌హామ్ టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. మ్యాచ్ అనంతరం బుమ్రా మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని రెండో టెస్ట్ అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్ కోసం బుమ్రా నెట్స్‌లో బాగానే కష్టపడ్డాడు. సుమారు 45 నిమిషాల పాటు బౌలింగ్ చేశాడు. అనంతరం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, థ్రోడౌన్ స్పెషలిస్ట్‌తో బ్యాటింగ్ సైతం ప్రాక్టీస్ చేశాడు. సిరీస్ మొదలయ్యే ముందు ఇంగ్లండ్ టూర్లో బుమ్రా కేవలం మూడు టెస్టులకు మాత్రమే ఆడుతానని చెప్పిన విషయం తెలిసిందే. లీడ్స్ టెస్ట్‌లో బుమ్రా ఆడగా.. రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్నాడు.
ప్రస్తుతం ఈ సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమానంగా ఉన్నాయి. ఇక భారత జట్టు మూడవ టెస్ట్‌కు భారీగానే కసరత్తు చేసింది. ప్రాక్టీస్ సెషన్లో ముమ్మరంగా పాల్గొంది. బుమ్రా ఎంతో ఉత్సాహంగా కనిపించగా.. సహచరులతో చర్చలు కూడా జరిపాడు. ఇదిలా ఉండగా లార్డ్స్ టెస్ట్‌లో బుమ్రాను ప్రసిద్ కృష్ణ స్థానంలో జట్టులోకి రానున్నాడు. మరో వైపు అర్షదీప్ సింగ్ సైతం బాగానే సాధన చేశాడు. ఇక లార్డ్స్ పిచ్ బర్మింగ్‌హామ్ కంటే మరింత సవాల్‌గా నిలిస్తుందని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, నాలుగో ఫాస్ట్ బౌలర్‌గా నితీష్కుమార్రెడ్డితో బరిలోకి దిగుతుందా? అనే ఆసక్తికరంగా మారంది. మూడో టెస్టుకు ముందు కెప్టెన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్ ఈ ప్రాక్టీస్ సెషన్లో పాల్గోలేదు. సిరాజ్ తొలి రెండు మ్యాచ్‌లలో ఆడగా.. భారత బౌలర్లలో ఎక్కువ ఓవర్లు వేసింది అతనే కావడం విశేషం. బౌలింగ్ కోచ్ పరవూరు ఆనందన్ మాట్లాడుతూ బుమ్రాతోపాటు సిరాజ్ వర్క్‌లోడ్‌ను సైతం మేనేజ్ చేయాల్సి ఉందన్నారు. ప్రతి బౌలర్‌కు తన శారీరక స్థితిని బట్టి వర్క్‌లోడ్ ఉండేలా చూసుకుంటామన్నారు.