ENG Vs IND Test | ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండోటెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 80 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టు కెరీర్లో ఇది 23వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. మ్యాచ్‌లో జడేజా-శుభ్‌మన్ గిల్ ఇప్పటి వరకు ఆరో వికెట్ వంద పరుగులకుపైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో భారత్ 320 పరుగుల స్కోర్ చేయగలిగింది. ప్రస్తుతం గిల్ 115 పరుగులతో, జడేజా 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. మ్యాచ్ తొలిరోజు బుధవారం టీమిండియా 85 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
లీడ్స్ తర్వాత, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో కూడా కెప్టెన్ గిల్ సెంచరీ చేశాడు. ఇంగ్లండ్‌తో వరుసగా మూడు టెస్టు మ్యాచుల్లో సెంచరీ చేసిన ఐదో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు. మొహమ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రవిడ్ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. గిల్ టెస్ట్ కెరీర్లో ఏడవ సెంచరీని 199 బంతుల్లో పూర్తి చేశాడు. ఇటీవల గిల్ ఫుల్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులోనూ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
ఇంతకు ముందు 2024లో, ఇంగ్లాండ్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన సమయంలో ధర్మశాలలో జరిగిన మ్యాచ్‌లో గిల్ 110 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌పై వరుసగా మూడు సెంచరీలు సాధించిన ఐదో ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే ఇంగ్లాండ్‌పై వరుసగా రెండవ సెంచరీ సాధించిన మూడవ భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. ఇంతకు ఈ ఘనతను విజయ్ హజారే, మొహమ్మద్ అజారుద్దీన్ సాధించారు. ఇద్దరూ ఢిల్లీ, బ్రబోర్న్ (1951-52), లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్ (1990)లలో ఈ ఘనతను సాధించారు.