IND Vs ENG T20 | చెన్నై వేదికగా రెండో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ 165 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ రాణించడంతో ఇంగ్లాండ్ ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. టాస్ గెలిచిన టీమిండియా.. ఇంగ్లాండ్‌ను బౌలింగ్ఆకు ఆహ్వానించింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో వైపు జోస్ బస్టర్ జట్టును ఆదుకున్నాడు. 30 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 45 పరుగులు చేశాడు. బ్రైడన్ కార్స్ 17 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సహాయంతో 31 పరుగులతో రాణించారు. ఫుల్ జోష్‌లో ఉన్న బట్లర్‌ను అక్షర్ పటేల్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. వరుసగా రెండోసారి అర్ధ సెంచరీ చేయకుండానే పెవిలియన్‌కు పంపాడు. కార్స్ కూడా లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో ఇంగ్లాండ్ సట్టు ఆ మాత్రం స్కోర్ చేయగలిగింది. హ్యారీ బ్రూక్ 13, లియామ్ లివింగ్‌స్టోన్ 13, జామీ స్మిత్ 22 పరుగులు చేశారు. జోఫ్రా ఆర్చర్ తొమ్మిది బంతుల్లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా, మార్క్ వుడ్ మూడు బంతుల్లో ఐదు పరుగులు చేసి నాటౌట్ నిలిచారు. భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 1.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. ఫుల్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ మార్క్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం సంజు శాంసన్, తిలక్ వర్మ క్రీజులో ఉన్నారు.