IND Vs ENG | టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్ వివాదంలో చిక్కుకున్నాడు. శుభ్‌మన్ గిల్‌పై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. లీడ్స్‌లోని హెడింగ్లీలో శుక్రవారం ఇంగ్లండ్-భారత్ మధ్య టెస్టు మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్లాక్ సాక్స్ ధరించి మైదానంలోకి వచ్చాడు. నల్ల సాక్స్ ధరించడం ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించడమే. లీడ్స్ టెస్ట్ తొలిరోజు గిల్ అద్భుతమైన బ్యాటింగ్ చేసి టెస్ట్ కెరియర్లో ఆరో సెంచరీని చేశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్‌గా టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ చేసిన ఆరో ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు.
మ్యాచ్ బ్యాటింగ్‌తో రాణించినా గిల్ ఐసీసీ రూల్స్‌ని బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో గిల్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. మ్యాచ్ మొదటిరోజు ఇన్నింగ్స్‌లో బ్లాక్ సాక్స్ ధరించడం ఐసీసీ రూల్స్‌కు విరుద్దం. 19.45 రూల్ ప్రకారం.. ఆటగాళ్లు తెలుపు లేకపోతే క్రీమ్, లేత బూడిద రంగు సాక్స్‌ను మాత్రమే ధరించేందుకు అనుమతి ఉంది. ఈ రూల్ మే 2023లో అమలులోకి వచ్చింది. ఈ మూడురంగులు వన్డేల్లో కూడా అనుమతి ఉంటుంది. మైదానంలోకి ప్రవేశించేటప్పుడు ధరించే ప్యాంట్ బేస్ కలర్ సాక్స్‌లను ధరించవచ్చు. గిల్ నల్ల సాక్స్ ధరించడంపై స్కై స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. గిల్‌ను నిషేధించే నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆధారపడి ఉంటుంది. ఇది ఉద్దేశపూర్వకంగా లెవల్ వన్ నేరమా? కాదా? అని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గిల్‌కు మ్యాచ్ ఫీజులో పది నుంచి 20శాతం జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అయితే, నిబంధన ఉల్లంఘన అనుకోకుండా జరిగితే.. ఉదాహరణకు అతని సాక్స్ తడిగా.. లేదంటే ఉపయోగించలేనివిధంగా ఉంటే.. శిక్ష నుంచి తప్పుకునేందుకు అవకాశం ఉంది. దీనిపై మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.
గతంలో కేఎల్ రాహుల్, గేల్ సైతం ఈ రూల్స్‌ను ఉల్లంఘించారు. 2018లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ సందర్భంగా కేఎల్ రాహుల్‌పై కూడా చర్య తీసుకున్నారు. ఆ సమయంలో రాహుల్ ఐసీసీ నిబంధనలకు విరుద్ధమైన హెల్మెట్ ధరించి ఉన్నట్లు తేలింది. అప్పుడు రాహుల్‌కు మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. 2016లో బిగ్ బాష్ లీగ్ సందర్భంగా వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ మ్యాచ్ సమయంలో నల్ల బ్యాట్ వాడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది సైతం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. అప్పుడు గేల్ కూడా మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. 2021లో ఎల్జీబీటీక్యూ ప్లస్, తరగతికి మద్దతుగా భారత్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రేయిన్బో కలర్ జెర్సీ ధరించినందుకు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జో రూట్ 15 శాతం జరిమానా విధించారు. అదే సమయంలో 2019 వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లండ్ -పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అనధికార లోగోలను ఉపయోగించినందుకు ఇమామ్-ఉల్-హక్ ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15శాతం జరిమానా విధించారు.
How many of you have been fined for wearing black socks before? 😅 pic.twitter.com/CMf1BN8lG0
— Sky Sports Cricket (@SkyCricket) June 20, 2025