IND vs ENG 5th Test | రోహిత్, గిల్ శతక జోరు.. మెరిసిన పడిక్కల్, సర్ఫరాజ్.. భారత్‌కు భారీ ఆధిక్యం..
IND vs ENG 5th Test | తొలి రోజు ఆటలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన టీమిండియా.. రెండోరోజూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత సారథి రోహిత్ శర్మకు తోడు శుభ్‌మన్ గిల్ శతకాలతో మెరిశారు.
IND vs ENG 5th Test | ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. తొలి రోజు ఆటలో బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించిన టీమిండియా.. రెండోరోజూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. భారత సారథి రోహిత్ శర్మ (162 బంతుల్లో 103, 13 ఫోర్లు, 3 సిక్సర్లు)కు తోడు శుభ్‌మన్ గిల్ (150 బంతుల్లో 110, 12 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో మెరిశారు. వీళ్లతో పాటు తొలి టెస్టు ఆడుతున్న దేవ్‌దత్ పడిక్కల్ (103 బంతుల్లో 65, 10 ఫోర్లు, 1 సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (60 బంతుల్లో 56, 8 ఫోర్లు, 1 సిక్స్) లు అర్థ సెంచరీలతో రాణించడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 8 వికెట్లు కోల్పోయి 473 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 218 పరుగులకే కట్టడి చేసిన భారత్.. ఇప్పటికే 255 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది.
రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 135-1తో బ్యాటింగ్‌కు వచ్చిన భారత్ నిన్నటి జోరును కొనసాగించింది. లంచ్ లోపే రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్లు సెంచరీలు పూర్తిచేసుకున్నారు. శతకాలు చేశాక ఈ ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. రోహిత్‌ను స్టోక్స్ ఔట్ చేయగా గిల్‌ను అండర్సన్ బౌల్డ్ చేశాడు. రెండో వికెట్‌కు ఈ ఇద్దరూ 171 పరుగులు జోడించడం విశేషం.
Stumps on Day 2 in Dharamsala!#TeamIndia extend their first-innings lead to 255 runs as they reach 473/8 👏👏
Kuldeep Yadav & Jasprit Bumrah with an unbeaten 45*-run partnership 🤝
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/6gifkjgSKJ
— BCCI (@BCCI) March 8, 2024
అనంతరం దేవ్‌దత్ పడిక్కల్ – సర్ఫరాజ్ ఖాన్లు భారత స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 97 పరుగులు జతచేశారు. అర్థ సెంచరీ చేశాక సర్ఫరాజ్ ఖాన్‌ను బషీర్ ఔట్ చేయగా పడిక్కల్ కూడా అతడి బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. టాప్ – 5 బ్యాటర్లు అర్థ సెంచరీలు చేసినా ఆ తర్వాత భారత బ్యాటింగ్ ఆర్డర్ తడబడింది. రవీంద్ర జడేజా (15), ధృవ్ జురెల్ (15), అశ్విన్ (0)లు విఫలమయ్యారు. కానీ 9, 10 స్థానాల్లో వచ్చిన కుల్దీప్ యాదవ్ (55 బంతుల్లో 27 నాటౌట్, 2 ఫోర్లు), జస్ప్రిత్ బుమ్రా (55 బంతుల్లో 19 నాటౌట్, 2 ఫోర్లు) 9 వికెట్‌కు అజేయంగా 45 పరుగులు జోడించి ఇంగ్లండ్‌కు విసుగు తెప్పిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే సుమారు 20 ఓవర్లు ఆడటం విశేషం. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ నాలుగు వికెట్లు తీయగా టామ్ హర్ట్లీ రెండు వికెట్లు పడగొట్టాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

