Shubman Gill | నాగ్‌పూర్ : ఒక మ్యాచ్, ఒక టెస్టు సిరీస్‌లో రాణించనంతమాత్రానా జట్టు ఫామ్‌ను నిర్వచించలేమని టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, ఆస్ట్రేలియా పర్యటనలో 1-3తో సిరీస్‌ను కోల్పోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు నాగ్‌పూర్‌లో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ మాట్లాడుతూ.. ‘ఒక్క సిరీస్‌తో జట్టు ఫామ్‌ను నిర్వచించలేం. మా జట్టు క్రికెటర్లు గతంలో సిరీస్‌లు, టోర్నమెంట్‌ల్లో నిలకడగా ఆడిన సందర్భాలు చాలా ఉన్నాయి. సిడ్నీ టెస్టులో బుమ్రా లేకపోవడంతో సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశాలను కోల్పోయాం. ఒక మ్యాచ్, ఒక సిరీస్ మా ఫామ్‌ను బేరీజు వేయలేదు. గతంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని రెండుసార్లు గెలుచుకున్నాం. టీ20 ప్రపంచకప్‌ను నెగ్గాం..’ అని అన్నాడు.