IND vs AUS WCL |ప్రపంచ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌లో ఇండియా ఛాంపియన్స్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఆస్ట్రేలియా చాంపియన్స్-ఇండియా చాంపియన్స్ మధ్య శనివారం మ్యాచ్ జరిగింది. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 91 పరుగులు చేశాడు. భారత్ విధించిన భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరు వికెట్ల కోల్పోయి 19.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. కల్లమ్ ఫెర్గూసన్ (70) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు దక్కింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో భారత్ ఆరో స్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలో ఉంది. మూడు మ్యాచుల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో ఐదు పాయింట్లు ఉన్నాయి. భారత్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓటమిపాలైంది. భారత్-పాక్ మ్యాచ్ రద్దు కావడంతో భారత్ ఖాతాలో ఒకే ఒక పాయింట్ ఉన్నది. పాక్‌తో మ్యాచ్‌ను రద్దు చేసుకున్న విసయం తెలిసిందే. ఇంతకుముందు మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై ఓటమిపాలైంది. ఈ నెల 27న ఇంగ్లండ్‌తో, జూలై 29న వెస్టిండీస్‌తో భారత్ మ్యాచులు ఆడనున్నది
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత చాంపియన్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఉతప్ప, ధావన్ తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఉతప్ప 21 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన అంబటి రాయుడు మరోసారి ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. దక్షిణాఫ్రికాపై సైతం డకౌట్ అయిన విషయం తెలిసిందే. ఇక సురేశ్ రైనా 11 బంతుల్లో 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ మూడు పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. ధావన్, యూసుఫ్ పఠాన్ ఐదవ వికెట్‌కు 100 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ధావన్ 60 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. యూసుఫ్ పఠాన్ 23 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియా తరఫున డేనియల్ క్రిస్టియన్ రెండు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ బ్రెట్ లీ, డార్సీ షార్ట్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు 65 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. షాన్ మార్ష్ 11 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రిస్ లిన్ 10 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్లతో 25 పరుగులు చేశాడు. డార్సీ షార్ట్ 15 బంతుల్లో మూడు ఫోర్లతో 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బెక్ డంక్ ఖాతా తెరువకుండానే అవుట్ అయ్యాడు. 5వ వికెట్‌కు ఫెర్గూసన్‌తో కలిసి క్రిస్టియన్ 90 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. క్రిస్టియన్ 28 బంతుల్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 39 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బెన్ కటింగ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఫెర్గూసన్, రాబ్ క్వినీతో కలిసి ఆస్ట్రేలియా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫెర్గూసన్ 38 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. క్వినీ ఎనిమిది బంతుల్లో 16 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారతదేశం తరఫున పియూష్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా, హర్భజన్ సింగ్ రెండు వికెట్లు తీశాడు. వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కింది.
మరో మ్యాచ్‌లో వెస్టిండిస్‌పై పాకిస్తాన్ విజయం సాధించింది. వెస్టిండీస్ ఛాంపియన్స్‌ను 49 పరుగుల తేడాతో ఓడించింది. ఇది ఆ జట్టుకు హ్యాట్రిక్ విజయం. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌ను ఓడించారు. పాకిస్తాన్ తదుపరి మ్యాచ్ జూలై 29న ఆస్ట్రేలియాతో జరగనుంది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 200 పరుగులు చేసింది. కమ్రాన్ అక్మల్ 62 బంతుల్లో 13 ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 113 పరుగులు చేశాడు. వెస్టిండీస్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. రమ్మాన్ రయీస్ మూడు వికెట్లు పడగొట్టగా.. సోహైల్ తన్వీర్, అమీర్ యామిన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో పాకిస్తాన్ నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నది. నాలుగు మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లు ఉన్నది. ఇదిలా ఉండగా క్రిస్ గేల్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో నాలుగో స్థానంలో ఉన్నది.