ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఆలస్యమైన ఈ మ్యాచ్ను 8 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. దీంట్లో తొలుతు బ్యాటింగ్ చేసిన ఆసీస్ 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్కు రోహిత్ శర్మ (11 బంతుల్లో 27 నాటౌట్) అద్భుతమైన ఆరంభం అందించాడు.
అతనికి మంచి సహకారం అందించిన కేఎల్ రాహుల్ (10) మూడో ఓవర్లో పెవిలియన్ చేరాడు. ఆడమ్ జంపా వేసిన బంతిని స్లాగ్ స్వీప్ చేసేందుకు చూసిన రాహుల్.. బంతి స్లోగా రావడంతో మిస్ అయ్యాడు. దీంతో అది వికెట్లను కూల్చింది. దీంతో మూడు ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు 40/1 స్కోరుతో నిలిచింది.