ILT20 : ఐపీఎల్ జూన్ 3న ముగియనున్న నేపథ్యంలో మరో పొట్టి క్రికెట్ యుద్దానికి తెరలేవనుంది. డిసెంబర్ 2న ఇంటర్నేషనల్ టీ20 నాలుగో సీజన్ షురూ కానుంది. అయితే.. ఆనవాయితీ ప్రకారం ప్రతిసారి జనవరి – ఫిబ్రవరి మధ్యలో టోర్నీ జరిగేది. కానీ, ఈసారి టీ20 వరల్డ్ కప్ (T20 World Cup 2026) ఉన్నందున షెడ్యూల్‌ను మార్చాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు.
డిసెంబర్ 2న యునైటెట్ అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం. యావత్ అరబ్ ప్రజానీకానికి పండుగ రోజైన ఆ తేదీని పునస్కరించుకొని లీగ్‌ను ప్రారంభించనున్నట్టు బుధవారం ఐఎల్టీ20 ఛైర్మన్ వెల్లడించాడు. ‘వచ్చే ఏడాది ఆరంభంలో టీ20 వరల్డ్ కప్ ఉంది. అందుకే ఐఎల్టీ20 నాలుగో సీజన్ షెడ్యూల్‌ను ముందుకు మార్చాం.
ILT20 organisers have advanced the 2026 season to avoid clash with the T20 World Cup, reports @vijaymirror.
Details: https://t.co/LyAoJrfeXd pic.twitter.com/9WUgnZybpm
— Cricbuzz (@cricbuzz) May 14, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE) జాతీయ దినోత్సవమైన డిసెంబర్ 2న ఐఎల్టీ20 నాలుగో సీజన్ ప్రారంభం కానుంది. అరబ్ క్యాలెండర్లో ఇవి మాకు చాలా ముఖ్యమైన రోజులు. వచ్చే ఏడాది జనవరి 4 వరకూ లీగ్ జరుగనుంది’ అని ఐఎల్టీ ఛైర్మన్ డేవిడ్ వైట్(David White) వివరించాడు. వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టీ20 వరల్డ్ కప్ పోటీలకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
గత సీజన్లో దుబాయ్ క్యాపిటల్స్ (Dubai Capitals) విజేతగా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో డెజర్ట్ వైపర్స్‌ను ఓడించి ట్రోఫీని కొల్లగొట్టింది. ఆరంభ ఎడిషన్ 2023లో గల్ఫ్ జెయింట్స్ ఛాంపియన్‌గా అవతరించింది. రెండో సీజన్లో ఆద్యంతం అదరగొట్టిన ఎంఐ ఎమిరేట్స్ (MI Emirates) టైటిల్‌ను ముద్దాడింది.