ప్రపంచ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్న జట్లలో అఫ్గానిస్తాన్ ఒకటి. ఈ జట్టు మాజీ కెప్టెన్ అస్ఘర్ అఫ్ఘాన్ ఇద్దరు టీమిండియా బ్యాటర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో మ్యాచ్ ఆడే సమయంలో ప్రపంచంలో ఏ జట్టయినా దాదాపుగా ఒకే తరహా ప్లాన్‌తో బరిలో దిగుతుందని అస్ఘర్ చెప్పాడు.
‘రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. వీళ్లిద్దరినీ అవుట్ చేస్తే సగం భారత జట్టు అవుటైనట్లే. అందుకే మేం ఆడేటప్పుడు వాళ్లను ముందుగానే ఎటాక్ చేయాలని డిసైడ్ అయ్యేవాళ్లం. ఎందుకంటే వీళ్లు గనుక సెటిల్ అయితే మ్యాచ్‌ను ప్రత్యర్థులకు దూరం చేసేస్తారు. ముఖ్యంగా కోహ్లీ.. అతను ఎంత కన్స్టింటెంట్గా ఆడతాడంటే.. కొంచెం కుదురుకుంటే మ్యాచ్ గెలిపించేస్తాడని అనిపిస్తుంది. అందుకే వాళ్లను టార్గెట్ చేసేవాళ్లం.
మేం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ జట్టయినా సరే భారత్‌తో ఆడాలంటే ఇలాంటి ప్లాన్‌తోనే వస్తుంది’ అని వెల్లడించాడు. అయితే వీళ్లిద్దరూ ఉన్నా కూడా ఆసియా కప్‌లో భారత్ సూపర్-4 దశలోనే నిష్క్రమించింది. దీనిపై స్పందించిన అస్ఘర్.. పేపర్‌పై భారత జట్టు బలంగా కనిపించినప్పటికీ, జడేజాకు గాయమవడం వల్ల జట్టు బ్యాలెన్స్ దెబ్బతిందని, అందుకే భారత్ ఓడిపోయిందని వివరించాడు.