Virat Kohli | నేను బౌలింగ్ చేస్తే రాజస్థాన్ 40 పరుగులకే ఆలౌట్ అయ్యేది: విరాట్ కోహ్లీ కామెడీ కామెంట్
Virat Kohli | భారత స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం తనలోని కమెడియన్‌ను బయటపెట్టాడు.
బెంగళూరు: భారత స్టార్ క్రికెటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ అనంతరం తనలోని కమెడియన్‌ను బయటపెట్టాడు. ఆదివారం ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా.. ఆర్ఆర్ జట్టు 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే కుప్పకూలింది.
దీనిపై ఆర్సీబీ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయర్ల మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కామెడీ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో తాను కూడా బౌలింగ్ చేసి ఉంటే ఆర్ఆర్ జట్టు కేవలం 40 పరుగలకే ఆలౌట్ అయ్యేదని అన్నాడు. దాంతో తోటి ఆటగాళ్లంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. కాగా, 112 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో ఆర్సీబీ జట్టు పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి చేరడంతోపాటు నెట్ రన్‌రేట్ కూడా మెరుగుపడింది.
భారీ తేడాతో ఓడిన ఆర్ఆర్ జట్టు ప్రస్తుతం 6వ స్థానానికి పడిపోయింది. నెట్ రన్‌రేట్ పరంగా గుజరాత్ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఆర్ఆర్ ఇప్పుడు పాజిటివ్ నెట్ రన్‌రేట్ ఉన్న జట్లలో అట్టడుగుకు పడిపోయింది. ఇదిలావుంటే ఆర్ఆర్ జట్టు 59 పరుగుల అతి తక్కువ స్కోరుకు ఆలౌట్ అవడం ద్వారా.. ఐపీఎల్ చరిత్రలో మూడో అతి తక్కువ స్కోర్‌ను నమోదు చేసింది.
Dressing Room Reactions RR v RCB
A near-perfect game, 2 points in the bag, positive NRR – that sums up the satisfying victory in Jaipur.
Parnell, Siraj, Maxwell, Bracewell and Anuj take us through the events that transpired and the road ahead.#PlayBold #ನಮ್ಮRCB #IPL2023 pic.twitter.com/cblwDrfVgd
— Royal Challengers Bangalore (@RCBTweets) May 15, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

