CM Siddaramaaih : కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. గత వారం రోజులుగా సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar)ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని నిశితంగా గమనిస్తున్న అధిష్టానం ఈ వివాదానికి ఎండ్ కార్డ్ వేయాలనుకుంటోంది. అందుకని ఇద్దరినీ శనివారం ఢిల్లీకి పిలిచింది. దాంతో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీల సమక్షంలోనే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ సిద్ధమవుతున్నారు.
హైకమాండ్ నుంచి పిలుపు వచ్చిందనే విషయాన్ని శుక్రవారం సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. నన్ను, శివకుమార్‌ను శనివారం ఢిల్లీకి రావాలని ఆదేశించింది. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సీఎం మార్పుపై చర్చలు జరుగనున్నాయి. ఇది కేవలం బ్రేక్ఫాస్ట మీటింగే. అయితే.. నేను అధిష్ఠానం మాటకు కట్టుబడి ఉంటాను. వారు ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావహిస్తాను అని సిద్ధరామయ్య చెప్పారు. కానీ, శివకుమార్ మాత్రం 2023 ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని అధిష్ఠానానికి విన్నవించుకోనున్నారు.
Decode this!!!!
DK Shivakumar Siddaramaiah pic.twitter.com/NhM7KSc7yW
— Being Political (@BeingPolitical1) November 27, 2025
కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇటీవలే రెండున్నరేళ్లు పూర్తైంది. దాంతో.. ఎన్నికల సమయంలో అనకున్నట్టే సీఎం పదవి శివకుమార్‌కు దక్కాలి. కానీ, సిద్ధరామయ్య మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ‘నవంబర్ రెవల్యూషన్’ మీడియా సృష్టేనని ఆయన కొట్టిపారేశారు.సీఎం తీరుతో విసిగిపోయిన శివకుమార్ వర్గం ఢిల్లీ చేరుకొని లాబీయింగ్ మొదలెట్టింది.
ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆ ಬೆಂಗಳೂರಿನ ಅರಮನೆ ಮೈದಾನದಲ್ಲಿ ಆಯೋಜಿಸಿದ್ದ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಸಮಗ್ರ ಶಿಶು ಅಭಿವೃದ್ಧಿ ಯೋಜನೆಯ “ಸುವರ್ಣ ಮಹೋತ್ಸವ”, ಮಕ್ಕಳ ದಿನಾಚರಣೆ, ವಿಶ್ವ ಹಿರಿಯ ನಾಗರಿಕರ ದಿನಾಚರಣೆ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭವನ್ನು ಉದ್ಘಾಟಿಸಿ, ಬಳಿಕ ಮಹಿಳಾ ಮತ್ತು ಮಕ್ಕಳ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆಯ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷಿ ಯೋಜನೆಗಳನ್ನು ಹಾಗೂ… pic.twitter.com/hCt4KUgxRx
— Siddaramaiah (@siddaramaiah) November 28, 2025
ఈ క్రమంలోనే సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఆ ఇద్దరూ పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఈ పరిణామాలను గమనించిన కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగింది. సీఎం మార్పుపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఢిల్లీ రావాలని సిద్ధరామయ్య, శివకుమార్‌లకు కబురు పంపంది. దాంతో.. శనివారం కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుంది? అని అందరిలో ఆసక్తి నెలకొంది.