Rajasthan Royals : ఐపీఎల్ వేలం గురించి మనందరికీ తెలిసిందే. ప్రతిభావంతులను కోటీశ్వరులు చేసే ఈ ఆక్షన్ థ్రిల్లింగ్‌గా సాగుతోంది. ఆటగాళ్ల మాదిరిగానే ఈమధ్య ఐపీఎల్ టీమ్‌లు కూడా వేలంలోకి వచ్చేస్తున్నాయి. పద్దెనిమిదో సీజన్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టును అమ్మకానికి పెట్టేశారు. తాజాగా మరో టీమ్ కోసం బిడ్డింగ్ జరుగనుంది. తొలి సీజన్ విజేత రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)ను అమ్మేసేందుకు యాజమాన్యం సిద్ధపడుతోందని సమాచారం. ఈ విషయాన్ని గురువారం ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గొయెంకా(Harsh Goenka) వెల్లడించారు.
పంతొమ్మిదో సీజన్‌కు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హెడ్‌కోచ్‌ల మార్పు.. కొత్త సిబ్బంది నియామకంతో పాటు ఫ్రాంచైజీల అమ్మకం కూడా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికే ఆర్సీబీని అమ్మేసేందుకు డియాగియో గ్రేట్ బ్రిటన్ (Diageo Great Britain) సంస్థ సిద్ధంగా ఉంది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ జాబితాలో చేరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
‘ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. బెంగళూరుతో పాటు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కూడా వదిలించుకోవాలని యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యధిక విలువ ఉన్నందున జట్టును అమ్మేసుకునేందుకు ఇదే సరైన సమయమని ఇరుజట్ల పెద్దలు అనుకుంటున్నారు. ఈ రెండు టీమ్‌లను కొనేందుకు నాలుగైదు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబై, పుణే, అహ్మదాబాద్, బెంగళూరు లేదా అమెరికాకు చెందిన ఇన్వెస్టర్లు.. కంపెనీలు ఈ రెండు జట్లను దక్కించుకోనున్నాయి’ అని ఎక్స్ పోస్ట్‌లో హర్ష గొయెంకా తెలిపారు.
I hear, not one, but two IPL teams are now up for sale- RCB and RR. It seems clear that people want to cash in the rich valuations today. So two teams for sale and 4/5 possible buyers! Who will be the successful buyers- will it be from Pune, Ahmedabad, Mumbai, Bengaluru or USA?
— Harsh Goenka (@hvgoenka) November 27, 2025
రాయల్ మల్టీస్పోర్ట్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హక్కుదారు. అయితే.. ఫ్రాంచైజీలో మనోజ్ బడలేకు అత్యధిక వాటా ఉంది. మనోజ్‌కు అమెరికాకు చెందిన రెడ్‌బర్డ్ క్యాపిటల్ పార్ట్నర్స్ కంపెనీ మద్దతు ఉంది. ఫ్రాంచైజీ వేలం గురించి రాజస్థా్న్ యాజమాన్యం ఇంతవరకైతే స్పందించలేదు. ఇటీవలే హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజీనామా, సీఈఓపై వేటు.. కెప్టె్న్ సంజూ శాంసన్‌ను ట్రేడింగ్ డీల్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్‌కు ఇచ్చేయడం వంటివి చర్చనీయాంశమయ్యాయి. ఇవన్నీ చూస్తే.. రాజస్థాన్‌లో ముసలం ముదురుతోందనే వార్తలు వైరలయ్యాయి. ఈ నేపథ్యంలో జట్టును అమ్మేస్తున్నారనే ప్రచారం జరగడంపై యాజమాన్యం ఏం చెబుతుందో చూడాలి.
🚨Rajasthan Royals on Sale🚨
After RCB, Rajasthan Royals are also looking for a new owner. 4-5 possible buyers.(Source:- Harsh Goenka)#IPL2026 #iplAuction pic.twitter.com/ATzH69gy7h— Cricbuzzz (@cricbbuzz) November 28, 2025
ఐపీఎల్లో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 18వ సీజన్లో ట్రోఫీని ముద్దాడింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB). ఇక ఐపీఎల్లో ఆర్సీబీ శకం మొదలైందని అందరూ అనుకుంటున్న వేళ.. ఫ్రాంచైజీని అమ్మేయాలని యాజమాన్యం భావిస్తోంది. మంచి ధర వస్తే బెంగళూరు జట్టును వదిలించుకోవాలని అనుకుంటోంది డియాగియో గ్రేట్ బ్రిటన్ (Diageo Great Britain) సంస్థ. ఈ మద్యం కంపెనీకి చెందిన వాటాదారులు ఐపీఎల్లో జట్టును కొనసాగించేందుకు అయిష్టత చూపిస్తున్నారట. అందుకే.. ఆర్సీబీని అమ్మేయడమే మంచిదని సంస్థ ఆలోచిస్తోంది. అయితే.. చిన్నస్వామి తొక్కిసలాట (Chinnaswamy Stampede), పోలీస్ కేసు తదనంతర పరిణామాల నేపథ్యంలో కొత్తవాళ్లకు జట్టును అప్పగించేందుకు ఆర్సీబీ యాజమాన్యం సిద్ధపడుతోంది.
🚨BREAKING NEWS🚨
It is official!! RCB have been put on sale.
The process has already been initiated. There is confidence that the sale will be completed by March 31, 2026. pic.twitter.com/H0jkN1yTuP
— Cricbuzz (@cricbuzz) November 5, 2025
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli), ‘ఐపీఎల్ విజేత’ అనే ట్యాగూ ఉండడంతో ప్రస్తుతం బెంగళూరు మార్కెట్ వాల్యూ రూ.17 వేల కోట్ల నుంచి రూ.18 వేలే కోట్ల వరకూ ఉంది. అభిమానుల ఫాలోయింగూ గట్టిగానే ఉన్నందున రూ.1.75లక్ష కోట్లకు ఫ్రాంచైజీని అమ్మాలని డియాగియో గ్రేట్ బ్రిటన్ కంపెనీ పావులు కదుపుతోంది. ఆర్సీబీని కొనేందుకు ఆరు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారత్‌కు చెందిన నాలుగు కంపెనీలతో పాటు అమెరికాకు సంబంధించిన రెండు సంస్థలు కూడా డియాగియో యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘అడార్ పూనావాలా’ (సీరమ్ ఇనిస్టిట్యూట్), జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ (JSW) అధినేత పార్థ్ జిందాల్, అదానీ గ్రూప్ (Adani Group) యాజమాన్యం రేసులో ఉన్నాయని తెలుస్తోంది.