ICC | ప్రపంచకప్ ప్రైజ్ మనీ విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరిగిన 20టీ వుమెన్స్ ప్రపంచకప్ జరుగనున్నది. ఈ క్రమంలో వుమెన్స్ క్రికెటర్లకు శుభవార్త చెప్పింది. ప్రపంచకప్‌లో మెన్స్ క్రికెటర్లతో సమానంగా వుమెన్స్ క్రికెటర్లకు సైతం ప్రైజ్‌మనీ ఇవ్వనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇకపై టీ20 టైటిల్‌ని నెగ్గిన జట్లు 23.40లక్షల అమెరికన్ డాలర్లు ప్రైజ్‌మనీ దక్కనున్నది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు 19.60కోట్లు. గతేడాది దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన వుమెన్స్టీ 20 ప్రపంచకప్ నెగ్గిన జట్టుకు రూ.8.37కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండిస్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా మెన్స్ జట్టుకు రూ.23.40లక్షల అమెరిన్ డాలర్ల ప్రైజ్‌మనీ లభించిన విషయం తెలిసిందే.
తాజాగా జరిగే వుమెన్స్ టీ20 విజేతకు సైతం అంతే మొత్తంలో ప్రైజ్‌మనీ దక్కబోతున్నది. గతేడాదితో పోలిస్తే ప్రైజ్‌మని 134శాతం పెరిగినట్లయ్యింది. ఐసీసీ జూలై 2023లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ప్రైజ్‌మనీపై నిర్ణయం తీసుకున్నది. ఐసీసీ తాజా నిర్ణయంతో క్రికెట్ వరల్డ్ కప్‌లో మెన్స్, వుమెన్స్ జట్టుకు సమానంగా ప్రైజ్‌మని ఇచ్చే తొలి క్రీడగా క్రికెట్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు ఇప్పుడు 1.7 మిలియన్ అమెరికన్ డాలర్లు అంటే రూ.14.24కోట్లు ఇవ్వనున్నారు. గతంలో రన్నరప్‌కు రూ.4.18కోట్లు దక్కేది. రన్నరప్ ప్రైజ్ మనీ సైతం 134 శాతం పెరగడం విశేషం. సెమీఫైనల్స్‌లో ఓడిన జట్లకు, గ్రూప్ దశలో నిష్క్రమించిన జట్లకు సైతం ప్రైజ్‌మనీని ఐసీసీ పెంచింది.