ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌ల కోసం నిరీక్షిస్తున్న అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రపంచ కప్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీని భారీగా పెంచిన అంతర్జాతీయ క్రికెట్ మండలి మ్యాచ్ టికెట్ల ధరను మాత్రం భారీగా తగ్గించింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో రూ.100కే మ్యాచ్ చూసే అవకాశం కల్పించింది. వరల్డ్ కప్ సందర్భంగా స్టేడియాలు నిండుగా కనిపించాలనే ఉద్దేశంతో టికెట్ల ధరను వంద నుంచి ప్రారంభించింది ఐసీసీ. tickets.cricketworldcup.com వెబ్సైట్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.
వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్లను దశలవారీగా అమ్మాలని ఐసీసీ భావిస్తోంది. అందుకే.. తొలిదఫాలో భాగంగా సెప్టెంబర్ 4 గురువారం రాత్రి 7 గంటల నుంచి వచ్చే నాలుగు రోజులు గూగూల్ పే ద్వారా టికెట్లకు డబ్బులు చెల్లించవచ్చని ఐసీసీ తెలిపింది. రెండో దశలో సెప్టెంబర్ 9 రాత్రి 8 గంటల నుంచి అభిమానులకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. మహిళల వరల్డ్ కప్ చరిత్రలో టికెట్ ప్రారంభ ధర రూ.100 ఉండడం ఇదే తొలిసారి.
Tickets for the 2025 Women’s ODI World Cup are now on sale!
🏆 Starts Sept 30 in Guwahati (IND vs SL opener)
📍 Played across 🇮🇳 & 🇱🇰 (5 venues)
👥 8 teams
💵 Tickets from just ₹100 — most affordable ICC event ever!
💰 Prize pool: $13.88M (4x 2022)
🎫 Get yours:… pic.twitter.com/tqMV2vFPlx— Sporttify (@sporttify) September 4, 2025
సెప్టెంబర్ 30 నుంచి వరల్డ్ కప్ సంబురం మొదలవ్వనుంది. పుష్కరకాలం తర్వాత భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో.. ఎనిమిది జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఆతిథ్య దేశాలైన భారత్, శ్రీలంకతో పాటు.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ బరిలో ఉన్నాయి. మొత్తంగా ఐదు వేదికలపై మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మనదేశంలోని ఇండోర్, గువాహటి, విశాఖపట్టణం, నవీ ముంబైలో.. లంకలోని కొలంబో స్టేడియంలో వరల్డ్ కప్ టోర్నీ జరుగనుంది.