T20 World Cup 2024 : ఉత్కంట పోరాటాలు, సంచలన బౌలింగ్ ప్రదర్శనలతో రంజుగా సాగుతున్న
పొట్టి ప్రపంచకప్ (T20 World Cup 2024)లో ఫిక్సింగ్(Fixing) కలకలం రేపింది. తొలిసారి టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన పసికూన ఉగాండా(Uganda) జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడిందని ప్రచారం మొదలైంది. దాంతో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. ఒకవేళ ఉగాండా మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమై ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది. అసలేం జరిగిందంటే..?
మెగా టోర్నీలో భాగంగా గ్రూప్ సిలోని ఉగాండా కరీబియన్ గడ్డపై లీగ్ మ్యాచ్‌లు ఆడింది. అయితే.. గయానాలో మ్యాచ్‌ల సమయంలో కెన్యా మాజీ ఫాస్ట్ బౌలర్ ఒకరు ఉగాండా క్రికెటర్‌ను కలిశాడట. అంతేకాదు ఆ తర్వాత పలు ఫోన్ నంబర్ల నుంచి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించాడని ఆన్లైన్లో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. దాంతో ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక బృందం ఉగాండా ఆటగాళ్లను ప్రశ్నించేందుకు సిద్దమైంది. ఒకవేళ ఆ ఆరోపణలే నిజమైతే సదరు క్రికెటర్‌పై నిషేధం విధించే అవకాశముంది.

‘ఫిక్సింగ్ చేయాలనుకున్న వ్యక్తి ఉగాండా క్రికెటర్‌ను టార్గెట్ చేయడంలో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. ఎందుకంటే.. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో పెద్ద జట్ల ఆటగాళ్ల కంటే వీళ్లను వలలో పడేయడం తేలిక. అయితే.. సదరు క్రికెటర్ ఈ విషయాన్ని ముందుగానే ఐసీసీకి తెలియజేసి ఉంటే బాగుండేది’ అని ఐసీసీ వర్గాలు అంటున్నాయి.
The Cricket Cranes’ #T20WorldCup journey has come to an end with a 9-wicket defeat to New Zealand.
The boys picked up a history win (against Papua New Guinea) from the 4 games.
Very proud of your efforts!#WeAreCricketCranes #WearYourCricketCranesJersey pic.twitter.com/COFJPabPdc
— Uganda Cricket Association (@CricketUganda) June 15, 2024
తొలిసారి టీ20 వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించిన ఉగాండా ఆకట్టుకుంది. పపువా న్యూ గినియావై విజయంతో టోర్నీలో పాయింట్ల ఖాతా తెరిచింది. అయితే.. చివరి లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 40 పరుగులకే ఉగాండా టీమ్ ఆలౌటయ్యింది. మెగా టోర్నీలో బ్రియాన్ మసబా సారథ్యంలో ఆడిన ఉగాండా మూడో స్థానంతో సరిపెట్టుకుంది.