చిలుకూరు, జనవరి 5 : సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పాత కొండాపురంలోని దళిత కాలనీకి చెందిన సందీప్ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను ట్రాక్టర్‌తో కూల్చివేశాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది.
స్థానికుల కథనం ప్రకారం.. పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం, బీఆర్ఎస్, టీడీపీ పొత్తులో సీపీఎం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కత్తిబాబు విజయం సాధించడంతో ఆదివారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ ఎస్సీ కాలనీకి రావొద్దంటూ సందీప్ గొడవకు దిగాడు. తర్వాత ట్రాక్టర్‌తో బీఆర్ఎస్ పార్టీ దిమ్మెను కూల్చివేశాడు.