ICC Test Rankings | అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి (ICC) బుధవారం టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. టాప్-10లో ముగ్గురు భార బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 751 పాయింట్లతో ఆరోస్థానంలో నిలువగా.. యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఏడో ర్యాంక్‌కు చేరుకున్నాడు. సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రెండుస్థానాలు మెరుగుపరుచుకొని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఆరుస్థానాలు దిగజారుడు. ఇంతకుముందు మూడోస్థానంలో ఉండగా.. తాజాగా తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు.
ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో విఫలంకావడంతో ర్యాంకుపై సైతం ప్రభావం పడింది. బంగ్లాతో సిరీస్‌లో రాణించిన మరో పాక్ బ్యాటర్ రిజర్వాన్ ఏడు స్థానాలు మెరుగుపరుచుకొని టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ 881 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. కివీస్ ఆటగాళ్లు కేన్ విలియమన్, డారిల్ మిచెల్ రెండు, మూడోస్థానాల్లో ఉన్నారు. శ్రీలంతో జరిగిన టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ నాలుగో స్థానానికి చేరుకున్నాడు.