ICC Ranking | ఇంగ్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్ల పడగొట్టిన భారత జట్టు లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐసీసీ టీ20 ఇంటర్నేషనల్ ర్యాకింగ్స్లో టాప్-5కి చేరుకున్నాడు. ఏకంగా 25 స్థానాలు ఎగబాకి తొలిసారిగా ఐదో ప్లేస్‌కి చేరుకున్నాడు. అదే సమయంలో భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ని అధిగమించాడు. టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్లో రెండోసారి ఒక మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఘనత సాధించాడు. దాంతో టీ20ల్లో భారత్ తరఫున ఒకటి కంటే ఎక్కువసార్లు ఐదు లేదంటే అంతకన్నా ఎక్కువ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ ఈ ఘనత సాధించారు. 2018లో దక్షిణాఫ్రికా, 2022లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20ల్లో భువనేశ్వర్ ఐదు వికెట్లు తీశాడు. 2018లో ఇంగ్లాండ్, 2023లో దక్షిణాఫ్రికాపై కుల్దీప్ యాదవ్ వికెట్లు పడగొట్టాడు. వరుణ్ గతేడాది దక్షిణాఫ్రికాలో 17 పరుగులు ఇచ్చి ఐదు వికెట్ల కూల్చాడు.
ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో బంతితో రాణించాడు. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రషీద్ 2023లోనూ అగ్రస్థానానికి చేరుకోగా.. తాజాగా వెస్టిండిస్ బౌలర్ అకిల్ హుస్సేన్ని అధిగమించి అగ్రస్థానానికి చేరాడు. 718 రేటింగ్ పాయింట్ల రషీద్ ఖాతాలో ఉన్నాయి. అకిల్ హుస్సేన్ రెండో స్థానంలో ఉండగా.. శ్రీలంక ఆటగాడు వనిందు హసరంగ మూడో స్థానంలో ఉన్నాడు. టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌తో ఆడిన మూడు మ్యాచుల్లో 108 పరుగులు చేశాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ ఉన్నది. దాంతో కెరియర్లో తొలిసారిగా ఐసీసీ ర్యాకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు. 832 పాయింట్లతో బ్యాటర్స్ ర్యాకింగ్‌లో రెండో స్థానానికి చేరాడు. ఇక ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ 855 పాయింట్లతో నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా జోరు కొనసాగుతున్నది. ప్రస్తుతం పాండ్యా నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. 255 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఇప్పటి వరకు 50 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు. అదే సమయంలో అక్షర్ పటేల్ టాప్-12లో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 17 పరుగులు చేసి ఐదు వికెట్లు తీశాడు.
Virat Kohli | రైల్వేస్‌తో రంజీ మ్యాచ్‌కు వేగంగా సన్నద్ధమవుతున్న విరాట్ కోహ్లీ
Steve Smith: టెస్టుల్లో స్టీవ్ స్మిత్ 10,000 పరుగులు.. 15వ బ్యాటర్‌గా రికార్డు