Virat Kohli : భారత (Indian) స్టార్ బ్యాటర్ (Star batter) విరాట్ కోహ్లీ (Virat Kohli) దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ రంజీ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఈ నెల 30న ఢిల్లీ (Delhi), రైల్వేస్ (Railways) జట్ల మధ్య ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో.. కోహ్లీ ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ నేపథ్యంలో రైల్వేస్‌తో రంజీ మ్యాచ్ కోసం వేగంగా సన్నద్ధమవుతున్నాడు. మంగళవారమే అరుణ్ జైట్లీ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు.
బుధవారం కూడా ఉదయాన్నే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రాక్టీస్ చేస్తూ ఉత్సాహంగా కనిపించాడు. కోహ్లీ తీరు చూస్తుంటే చాన్నాళ్ల తర్వాత ఆడబోతున్న రంజీ మ్యాచ్ కోసం ఉవ్విళ్లూరుతున్నట్లు కనబడుతోంది. కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్ధం కావడంతో ఢిల్లీ టీమ్ మేనేజ్మెంట్ అతనికి కెప్టెన్సీ ఆఫర్ చేసింది. కానీ కోహ్లీ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. యువ కెప్టెన్ ఆయుష్ బదోనీ కెప్టెన్సీలో ఆడేందుకే మొగ్గు చూపాడు.
కాగా రంజీ ట్రోఫీ గ్రూప్-Dలో ఢిల్లీ.. ఒక గెలుపు, రెండు ఓటములు, మూడు డ్రాలతో ఆరో స్థానంలో ఉన్నది. సౌరాష్ట్రతో జరిగిన గత మ్యాచ్‌లో ఢిల్లీ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇండియన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సౌరాష్ట్ర తరఫున 12 వికెట్లు తీసి ఢిల్లీని దెబ్బకొట్టాడు. జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టాడు. కాగా 36 ఏళ్ల విరాట్ కోహ్లీ 2012 ఉత్తరప్రదేశ్‌లో తన ఆఖరి రంజీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు మళ్లీ ఆడబోతున్నాడు.
Steve Smith: టెస్టుల్లో స్టీవ్ స్మిత్ 10,000 పరుగులు.. 15వ బ్యాటర్‌గా రికార్డు
Gongadi Trisha | త్రిష రికార్డు.. అండర్-19 మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో తొలి సెంచరీ