ICC : రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌పై ప్రభావం పడింది. ఫైనల్ బెర్తు దక్కించుకునే జట్లు ఏవి? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. ఐసీసీ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే జట్ల పేర్లు వెల్లడించింది. ఈ మెగా ఫైనల్ మూడు జట్ల మధ్య జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ ఆడే అవకాశం 88.9 శాతం ఉందని ఐసీసీ అభిప్రాయపడింది.
ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఫైనల్లో తలపడేందుకు 8.3 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది. అంతేకాదు భారత్, శ్రీలంక జట్లు డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడేందుకు 2.8శాతం అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 136 పాయింట్లు, 66.67 శాతం విజయాలతో పట్టికలో అగ్రస్థానంలో ఉంది. అయినా కూడా ఆ జట్టుకు ఫైనల్ బెర్తు ఖరారు కాలేదు. ఎందుకంటే.. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ తొలి రెండు టెస్టుల్లో ఆ జట్టు దారుణంగా ఓడిపోయింది.
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఆసీస్ 4-0తో ఓడిపోతే డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సన్నగిల్లుతాయి. అప్పుడు ఆస్ట్రేలియా ఫైనల్ చేరాలంటే శ్రీలంక, న్యూజిలాండ్‌ను 2-0తో ఓడించాలి. టీమిండియా 123 పాయింట్లు,64.06 శాతం విజయాలతో రెండో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక (64 పాయింట్లు, 53.33 శాతం విజయాలు), దక్షిణాఫ్రికా (76 పాయింట్లు, 48.72 శాతం విజయాలు) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.
ఈ ఏడాది జూన్‌లో ఓవల్ వేదిగా వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ జరగనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తులు ఖరారు కావడానికి కొన్నిటెస్టు సిరీస్‌ల ఫలితాలు కీలకం కానున్నాయి. అవేంటంటే..? భారత్, ఆస్ట్రేలియా మూడు, నాలుగు టెస్టులతో పాటు దక్షిణాఫ్రికా – వెస్టిడీస్, శ్రీలంక – న్యూజిలాండ్ సిరీస్ రిజల్ట్‌ను బట్టి డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడేది ఎవరో తేలనుంది.
1. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ (మొదటి టెస్టు) – సెంచూరియన్‌లో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 4 వరకు.
2. భారత్, ఆస్ట్రేలియా (మూడో టెస్టు) – మార్చి 1 నుంచి 5వ తేదీ వరకు, ఇండోర్ వేదిక.
3. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ (రెండో టెస్టు) – జొహన్నెస్‌బర్గ్ వేదికగా మార్చి 8-12 వరకు.
4. న్యూజిలాండ్, శ్రీలంక (మొదటి టెస్టు) – క్రిస్ట్‌చర్చ్, మార్చి 9-13.
5. భారత్, ఆస్ట్రేలియా (నాలుగో టెస్టు) – మార్చి 9- 13, అహ్మదాబాద్.
6. న్యూజిలాండ్, శ్రీలంక (రెండో టెస్టు) – మార్చి 17-21 వరకు, వెల్లింగ్టన్ వేదిక.