World Cup Moscots | సమానత్వ ప్రతీకగా ప్రపంచ కప్ మస్కట్లు.. ఫొటోలు చూశారా..!
World Cup Moscots : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) పోటీలకు అన్ని జట్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మెగా టోర్నీకి రెండు నెలన్నర రోజులే సమయం ఉంది. దాంతో ఐసీసీ(ICC) ఈరోజు రెండు రకాల ప్రపంచ కప్ మస్కట్(World Cup Moscots )లను విడుదల చేసింది. క్రికెట్లోనూ పురుషులు, మహిళలు సమానమే అనే ఉద్దేశంతో ....
World Cup Moscots : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) పోటీలకు అన్ని జట్లు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ మెగా టోర్నీకి రెండు నెలన్నర రోజులే సమయం ఉంది. దాంతో ఐసీసీ(ICC) ఈరోజు రెండు రకాల ప్రపంచ కప్ మస్కట్(World Cup Moscots )లను విడుదల చేసింది. క్రికెట్లోనూ పురుషులు, మహిళలు సమానమే అనే ఉద్దేశంతో ఈ మస్కట్లను తెచ్చామని ఐసీసీ తెలిపింది. గురుగ్రామ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో అండర్ -19 వరల్డ్ కప్ విజేతలు యశ్ ధూల్(Yash Dhull), షఫాలీ వర్మ(Shafali Verma) సమక్షంలో వీటిని ఆవిష్కరించారు. పురుషుల మస్కట్ నీలి రంగుల , మహిళల మస్కట్ ఎరపు రంగులో ఉన్నాయి.
‘వరల్డ్ కప్ పోటీల ముందు మస్కట్లను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇందులో చూపించిన క్యారెక్టర్లు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న ఆదరణను ప్రతిబింబిస్తాయి. మహిళల మస్కట్ ద్వారా ఈ లోకంలోని సమానత్వం, వైవిధ్యాన్ని చాటుతున్నాం. అంతేకాదు తర్వాతి తరం అభిమానులకు చేరువయ్యేందుకు ఈ మస్కట్లు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పిల్లల్ని ఉల్లాసపరచడంతో పాటు క్రికెట్ మీదున్న ప్రేమను చూపడంలో ఈ రెండు మస్కట్లు కీలక పాత్ర పోషిస్తాయి’ అని ఐసీసీ ఈవెంట్స్ అధ్యక్షుడు క్రిస్ టెట్లీ(Chris Tetley) వెల్లడించాడు.
The two #CWC23 mascots are here 😍
Have your say in naming this exciting duo 👉 https://t.co/AytgGuLWd5 pic.twitter.com/7XBtdVmtRS
— ICC (@ICC) August 19, 2023
మస్కట్ విడుదల సందర్భంగా ఐసీసీ ఒక వీడియోను విడుదల చేసింది. అందులో భారత స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా బుల్లెట్ లాంటి బంతులు సంధిస్తాడు. బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ బంతుల్ని స్టాండ్స్ దాటిస్తాడు. ఇంగ్లండ్ విధ్వంసక ఓపెనర్ జోస్ బట్లర్ తరహా సెలబ్రేషన్‌తో వీడియో ముగుస్తుంది. ఈ ఏడాది ప్రపంచ కప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇస్తోంది. అక్టోబర్ 5న జరిగే ఆరంభ పోరులో ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఢీ కొననున్నాయి.
ఇవి కూడా చదవండి
Rahkeem Cornwall | వేగంగా పరుగెత్తలేక.. రనౌటైన బాహుబలి క్రికెటర్.. వీడియో వైరల్
Virat Kohli | వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వీడ్కోలు..! పాక్ మాజీ పేసర్‌కు గంగూలీ కౌంటర్ ఇదే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

