Virat Kohli | వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వీడ్కోలు..! పాక్ మాజీ పేసర్‌కు గంగూలీ కౌంటర్ ఇదే
Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐదొందల మ్యాచ్‌లో సెంచరీ బాదిన విరాట్ ఆసియా కప్(Asia Cup 2023), వన్డే ప్రపంచ కప్(ODI WC2023)లో కీలకం కానున్నాడు. అయితే.. ఈ దిగ్గజ ఆటగాడి గురించి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ వన్డేలకు వీడ్కోలు పలకాలని, సచిన్ వంద సెంచరీల రికార్డు...
Virat Kohli : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఐదొందల మ్యాచ్‌లో సెంచరీ బాదిన విరాట్ ఆసియా కప్(Asia Cup 2023), వన్డే ప్రపంచ కప్(ODI WC2023)లో కీలకం కానున్నాడు. అయితే.. ఈ దిగ్గజ ఆటగాడి గురించి పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్(Shoaib Akhtar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ కప్ తర్వాత కోహ్లీ వన్డేలకు వీడ్కోలు పలకాలని, సచిన్ వంద సెంచరీల రికార్డు బద్దలు కొట్టాలంటే అతను టెస్టుల్లో మాత్రమే కొనసాగాలని అక్తర్ అభిప్రాయపడ్డాడు. అతడి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
‘వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ 50 ఓవర్ల ఫార్మాట్లో కొనసాగుతాడని నేను అనుకోవడం లేదు. టీ20ల్లో అతను ఈ మధ్య ఆడడం లేదు. విరాట్ మరో ఆరేళ్లు ఆడి సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) నెలకొల్పిన వంద శతకాల రికార్డును బ్రేక్ చేయాలని నేను అనుకుంటున్నా. పరుగుల యంత్రమైన కోహ్లీకి వంద సెంచరీల మార్క్ అందుకోగల సత్తా ఉంది. అందుకని ప్రపంచ కప్ తర్వాత అతను పూర్తిగా టెస్టుల మీదే ఫోకస్ పెట్టాలి. అప్పుడే ఈ ఫీట్ సాధ్యమవుతుంది’ అని అక్తర్ అన్నాడు. అయితే.. భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మాత్రం అతడి అభిప్రాయంతో ఏకీభవించలేదు. అలా ఎందుకు? కోహ్లీ తనకిష్టమైన ఫార్మాట్లో ఆడతాడు. ఎందుకంటే.. అతను అవలీలగా పరుగులు సాధిస్తాడు అని గంగూలీ గట్టి కౌంటర్ ఇచ్చాడు.
విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్

రెండేళ్ల క్రితం ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీ నిరుడు ఆసియా కప్(Asia Cup 2022)తో టచ్‌లోకి వచ్చాడు. శ్రీలంకపై సెంచరీతో మళ్లీ మునపటి విరాట్‌ను గుర్తు చేశాడు. ఆ తర్వాత టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై (82 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. బంగ్లాదేశ్‌పై వన్డేల్లో వంద కొట్టాడు. సొంతగడ్డపై బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో మరో శతకం బాదాడు.
ఐపీఎల్ 16వ సీజన్లో కోహ్లీ సెంచరీల మోత

ఐపీఎల్ 16వ సీజన్లోనూ ఈ రన్ మెషీన్ జోరు కొనసాగించాడు. వరుసగా రెండు సెంచరీలతో తన బ్యాట్ పవర్ చూపించాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఈ దిగ్గజ క్రికెటర్ 121 రన్స్‌తో రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం అతను ఆసియా కప్‌పై దృష్టి పెట్టాడు. ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ ఆగస్టు 30న మొదలవ్వనుంది. ఆ తర్వాత అంటే.. నెల రోజుల లోపే సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి.
ఇవి కూడా చదవండి
Asia Cup 2023 | టీమిండియా స్క్వాడ్ ఎంపిక ఆరోజే.. హాజరుకానున్న ద్రవిడ్
Asia Cup 2023 | ట్రైనింగ్‌లో భాగంగా నిప్పులపై నడిచిన స్టార్ క్రికెటర్.. వీడియో వైరల్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

