Asia Cup 2023 | టీమిండియా స్క్వాడ్ ఎంపిక ఆరోజే.. హాజరుకానున్న ద్రవిడ్
Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2023) టోర్నమెంట్‌కు మరో 11 రోజులే ఉంది. ఇప్పటికే మూడు దేశాలు స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఫేవరెట్ అయిన టీమిండియా(Team India) మాత్రం ఇంకా జట్టు వివరాలు వెల్లడించలేదు. దాంతో, భారత బృందంలో ఎవరెవరు ఉంటారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ ఊహాగానాలకు ఆగస్టు 21 సోమవారం...
Asia Cup 2023 : ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్(Asia Cup 2023) టోర్నమెంట్‌కు మరో 11 రోజులే ఉంది. ఇప్పటికే మూడు దేశాలు స్క్వాడ్‌ను ప్రకటించాయి. ఫేవరెట్ అయిన టీమిండియా(Team India) మాత్రం ఇంకా జట్టు వివరాలు వెల్లడించలేదు. దాంతో, భారత బృందంలో ఎవరెవరు ఉంటారు? అనే ఆసక్తి అందరిలో మొదలైంది. ఈ ఊహాగానాలకు ఆగస్టు 21 సోమవారంతో తెరపడనుంది. ఆరోజు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 15మంది ఆటగాళ్ల బృందాన్ని ఎంపికచేయనుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) ఈ సెలెక్షన్ ప్రక్రియకు హాజరుకానున్నాడు.
ఢిల్లీలోని బీసీసీఐ కార్యాలయంలో ఆగస్టు 21న సెలెక్షన్ కమిటీ సమావేశం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)తో పాటు ద్రవిడ్ కూడా ఈ భేటీలో పాల్గొంటారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్(ODI World Cup 2023) ముందు భారత జట్టు ఆడనున్న ఏకైక వన్డే టోర్నీ ఆసియా కప్. దాంతో, ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని 15మంది స్క్వాడ్‌ను ఎంపిక చేయనున్నారు. శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) గాయపడడంతో ఖాళీ ఏర్పడిన నాలుగో స్థానానికి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరం.
జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ

మరోవైపు.. 9 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడిన పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఐర్లాండ్‌పై తొలి టీ20లో రెండు వికెట్లతో రాణించాడు. మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ(Prasidh Krishna) కూడా చక్కగా బౌలింగ్ దేశాడు. వీళ్లిద్దరిని తీసుకొని బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేస్తారా? యంగ్‌స్టర్స్ యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వా డ్లకు అవకాశం ఇస్తారా? అనేది మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. ఈసారి హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్న ఆసియా కప్ ఆగస్టు 30న మొదలవ్వనుంది. ఆ తర్వాత అంటే.. నెల రోజుల లోపే సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి.
ఇవి కూడా చదవండి
Ireland Cricketer | ఎనిమిదో స్థానంలో వచ్చి.. భారత్‌పై అరుదైన రికార్డు నెలకొల్పిన ఐర్లాండ్ క్రికెటర్
Novak Djokovic | నిట్టో ఏటీపీ ఫైనల్లో జకోవిచ్.. ఫెదరర్ రికార్డు బద్ధలు కొడతాడా..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

