Rahkeem Cornwall | వేగంగా పరుగెత్తలేక.. రనౌటైన బాహుబలి క్రికెటర్.. వీడియో వైరల్
Rahkeem Cornwall : ప్రపంచంలోనే భారీకాయుడైన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్ (Rahkeem Cornwall) మరోసారి ఆన్లైన్లో వైరల్ అయ్యాడు. ఈ బాహుబలి క్రికెటర్ వేగంగా పరుగెత్తలేక రనౌటయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమధ్యే మొదలైన కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League 2023)లో ఈ సంఘటన....
Rahkeem Cornwall : ప్రపంచంలోనే భారీకాయుడైన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ రకీం కార్న్‌వాల్ (Rahkeem Cornwall) మరోసారి ఆన్లైన్లో వైరల్ అయ్యాడు. ఈ బాహుబలి క్రికెటర్ వేగంగా పరుగెత్తలేక రనౌటయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈమధ్యే మొదలైన కరీబియన్ ప్రీమియర్ లీగ్(Caribbean Premier League 2023)లో ఈ సంఘటన చోటు చేసుకుంది. బార్బడోస్ రాయల్స్(Barbados Royals) జట్టు తరఫున ఆడుతున్న రకీం కార్న్‌వాల్ ఎదుర్కొన్న మొదటి బంతికే రన్ తీసేందుకు ప్రయత్నించాడు.
లెగ్ సైడ్‌లో కాచుకొని ఉన్నసెయింట్ లూసియా కింగ్స్(Saint Lucia Kings)జట్టు ఫీల్డర్ క్రిస్ సోలె(Chris Sole) బంతిని ఆపాడు. రకీం సగం దూరం పరుగెత్తేలోపే అతను డైరెక్ట్ త్రోతో వికెట్లను పడగొట్టాడు. దాంతో, రకీం నిరాశగా పెవిలియన్ చేరాడు.
Tonight’s @BetBarteronline magic moment is the run out of Rahkeem Cornwall that set the Saint Lucia Kings off on a fantastic PowerPlay! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/HgDtLWTjmK
— CPL T20 (@CPL) August 18, 2023
మొదట ఆడిన సెయింట్ లూసియా జట్టు 6 వికెట్ల నష్టానికి 201 రన్స్ కొట్టింది. సియాన్ విలియమ్స్(47), డూప్లెసిస్(46) దంచి కొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో రకీం కార్న్‌వాల్(0) ఓపెనర్‌గా వచ్చి డకౌట్ అయ్యాడు. చివర్లో నయిం యంగ్ 48 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో బార్బడోస్ 54 రన్స్ తేడాతో ఓడిపోయింది.
ఇవి కూడా చదవండి
Virat Kohli | వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ వీడ్కోలు..! పాక్ మాజీ పేసర్‌కు గంగూలీ కౌంటర్ ఇదే
Asia Cup 2023 | టీమిండియా స్క్వాడ్ ఎంపిక ఆరోజే.. హాజరుకానున్న ద్రవిడ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

