ICC ODI Rankings | ఐసీసీ బుధవారం వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ర్యాకింగ్స్లో భారత ఆటగాళ్లకు టాప్-5లో నలుగురు భారత బ్యాట్స్మెన్లు చోటు దక్కించుకున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని రెండో స్థానానికి చేరాడు. ఇక శుభ్‌మన్ గిల్ ఒక స్థానం కోల్పోయి మూడో ప్లేస్‌లో నిలిచాడు. స్టార్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ బ్యాట్‌తో రాణించాడు. దాంతో వన్డే ర్యాంకింగ్స్‌లో ఓ స్థానానికి మెరుగుపరుచుకున్నాడు. గతేడాది నవంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి అనంతరం రోహిత్ తొలి వన్డే సిరీస్‌లో కనిపించాడు. ఇక లంకతో జరిగిన సిరీస్‌లో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో సహా టీమిండియా బ్యాటర్లు అంతా విఫలమయ్యారు.
కేవలం రోహిత్ శర్మ మాత్రమే ఆకట్టుకోగలిగాడు. రోహిత్ మూడు మ్యాచ్‌లు ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లో 52.33 సగటుతో 157 పరుగులు చేశాడు. వీటిలో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ సిరీస్‌ను మాత్రం భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ ఆటగాడు బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం 824 రేటింగ్ పాయింట్లతో బాబర్ అజామ్ నెంబర్ వన్‌గా కొనసాగుతుండగా.. రోహిత్ 765 పాయింట్లతో టాప్-2లో ఉన్నాడు. ఇక టాప్-20లో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ 16వ స్థానంలో ఉండగా.. కేఎల్ రాహుల్ ఒక స్థానం దిగజారి 21వ ప్లేస్‌కు చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో స్థానం, ఆడమ్ జంపా మూడో ప్లేస్‌లో కొనసాగుతున్నారు.
ఇక టీమిండియా ఫాస్ట్‌బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఎనిమిది, మహ్మద్ సిరాజ్.. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్డ్‌తో కలిసి తొమ్మిదో ప్లేస్‌లో నిలిచాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ 12వ స్థానంలో ఉన్నాడు. షమీ చీలమండ గాయంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. వచ్చే నెల బంగ్లాదేశ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌లో పునరాగమనం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు) తీసిన వాషింగ్టన్ సుందర్ 10 స్థానాలు ఎగబాకి 87వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 16వ స్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా నాలుగు స్థానాలు దిగజారి 26వ స్థానానికి చేరాడు. ఇక టీమ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే 118 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు నెంబర్ వన్‌గా కొనసాగుతున్నది. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా రెండు, మూడో స్థానాల్లో నిలిచాయి.
Vinesh Phogat | ముగిసిన ఒలింపిక్స్ క్రీడలు.. రెజ్లర్ వినేశ్ ఫోగట్ భారత్‌కు చేరుకునేది ఎప్పుడు..?
Morne Morkel: బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్.. ద్రువీకరించిన బీసీసీఐ కార్యదర్శి