ICC : టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తలరించాలనే విషయమై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) బెట్టు వీడడం లేదు. ఇదివరకే షెడ్యూల్ ప్రకటించినందున నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) కోరినా బంగ్లా బోర్డు ససేమిరా అంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగనుంది. చివరి ప్రయత్నింగా ఇద్దరు సీనియర్ ప్రతినిధులను బంగ్లా దేశ్ బోర్డు సభ్యులతో చర్చించేందుకు పంపించనుంది.
భారత్, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ షురూ కానుంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. వేదికలను కూడా ఖరారు చేసింది. కానీ, బంగ్లాదేశ్ బోర్డు మాత్రం తమ జట్టును భారత్‌కు పంపించబోమని భీష్మించుకుంది. దాంతో, ఆ దేశ బోర్డుతో చర్చలు మొదలెట్టింది ఐసీసీ. భద్రతా కారణాలరీత్యా ఇండియాలో ఆడబోమనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని వీడియో కాల్లో కోరినప్పటికీ బంగ్లా బోర్డు ‘అదేం కుదరదు’ అంటోంది. అందుకని ఇద్దరు సీనియర్ ప్రతినిధులను ఆ దేశానికి పంపి.. వారికి భరోసా కల్పించాలని ఐసీసీ భావిస్తోంది. ప్రపంచ క్రికెట్లో బంగ్లాదేశ్‌ను తాము వేరుగా చూడబోమనే నమ్మకాన్ని వారికి కలిగించి.. భారత్‌లో వరల్డ్‌కప్ ఆడేందుకు ఒప్పించనుంది.
The BCB released a statement on Tuesday, following a video conference with the ICC, reiterating its request to move Bangladesh’s matches outside India
Full story: https://t.co/9M33hIRhKR pic.twitter.com/8QslhX77aj
— ESPNcricinfo (@ESPNcricinfo) January 14, 2026
బంగ్లాదేశ్‌లో ఈమధ్య హిందువుల హత్య ప్రభావం చివరకు టీ20 ప్రపంచకప్‌పై పడింది. ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ (Mustafizur Rehaman)ను కొనడంపై విమర్శలు వెల్లువెత్తడంతో.. చివరకు ముస్తాఫిజుర్‌పై వేటు పడింది. దాంతో, ఒక్క ఆటగాడికే భద్రత కల్పించలేని బీసీసీఐ ప్రపంచకప్‌లో మా జట్టుకు, కోచింగ్ సిబ్బందికి, అభిమానులకు రక్షణ ఇస్తుందనే నమ్మకం మాకు లేదని బంగ్లా బోర్డు అంటోంది.
ఇదే కారణంతో వరల్డ్‌కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి తరలించాలని ఐసీసీకి లేఖ రాసింది. అప్పటినుంచి బంగ్లా జట్లు మ్యాచ్‌లపై అనిశ్చితి నెలకొంది. ఇండియాలో కాకుండా ఎక్కడమైనా తాము ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడుతామని ఐసీసీతో వీడియో కాల్లో ఆ దేశ బోర్డు పునరుద్ఘాటించింది. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7న ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో బంగ్లా తలపడాలి.