ICC : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న అమెరికాకు ఊరట లభించింది. ఆ దేశ క్రికెట్లో తలెత్తిన విభేదాలకు చెక్ పెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) మూడు నెలల సమయం ఇచ్చింది. ఆలోపే హైబ్రిడ్ మోడల్లో ఎన్ని జట్లకు అనుమతి ఇవ్వాలనే విషయం తేల్చనుంది. జై షా (Jai Shah) నేతృత్వంలోని ఐసీసీ కార్యవర్గం శనివారం సింగపూర్‌లో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ మీటింగ్‌లో అమెరికా క్రికెట్ (యూఎస్ఏసీ)పై ప్రధానంగా చర్చించారు సభ్యులు. తమ అంతర్గత వ్యవహారాన్ని మూడు నెలల్లోగా చక్కబెట్టుకోవాలని యూఎస్ఏసీకు అల్టిమేటం జారీ చేశారు.
ఏడాది కాలంగా అమెరికా క్రికెట్లో సంక్షోభం కొనసాగుతోంది. 2024 జూలైలోనే అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకోవాలని ఐసీసీ సూచించింది. ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో పర్యటించిన నార్మలైజేషన్ కమిటీ అక్కడి పరిస్థితులు ఆశాజనకంగా లేవని భావించింది. ఇదే విషయాన్ని ఐసీసీ పెద్దల దృష్టికి తీసుకొచ్చింది. మరే ఇతర సభ్య దేశం బోర్డు తీరు సరిగ్గా లేకుంటే కచ్చితంగా వేటు పడేది. కానీ, 2028 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న కారణంగా అమెరికా బోర్డు బతికిపోయింది.
🇺🇸 USA Cricket have avoided immediate suspension — for now.
Despite reports suggesting an urgent suspension, the ICC has granted them an additional 3 months to sort out their long-standing governance issues.#USACricket #CricketEverywhere pic.twitter.com/ViWs6l9AZR
— Associate Chronicles (@FaysalS14986923) July 19, 2025
మరో విషయం ఏంటంటే.. లాస్ ఏంజిల్స్‌లో జరుగబోయే విశ్వ క్రీడలకు హోస్ట్ అయినందున అమెరికా పురుషుల, మహిళల జట్లు నేరుగా అర్హత సాధించాలి. కానీ, ఈ జట్లకు ప్లేయర్లను ఎవరు ఎంపిక చేస్తారు? అనే విషయంలో స్పష్టత కొరవడింది. ఈ వ్యవహారం ఎటూ తేలకపోవడంతో అటు అమెరికా క్రికెట్‌తో పాటు ఇటు ఐసీసీ కూడా తలపట్టుకుంటోంది.