Mithun Reddy | ఏపీ మద్యం స్కామ్.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్..!
Mithun Reddy | ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసులో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న ఆయనను సిట్ విజయవాడలోని కార్యాలయంలో దాదాపు 7గంటలపాటు విచారించింది.
Mithun Reddy | ఆంధ్రప్రదేశ్ మధ్యం కుంభకోణం కేసులో ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. కుంభకోణం కేసులో ఏ-4గా ఉన్న ఆయనను సిట్ విజయవాడలోని కార్యాలయంలో దాదాపు 7గంటలపాటు విచారించింది. అనంతరం ఆయనను అరెస్ట్ చేసినట్లుగా బంధువులకు సమాచారం అందించారు. మిథున్ రెడ్డికి చెంతదిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు సిట్ గుర్తించింది. ఆ వివరాలను ఇవాళ్టి విచారణలో ఆయన ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు, సుప్రీం కోర్టు కొట్టేశాయి. ఈ కేసులో ఇప్పటివరకు 12మంది అరెస్ట్ అయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో సిట్ శనివారం తొలి చార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో కీలక విషయాలను వెల్లడించింది. అయితే, మిథున్ రెడ్డి పేరును మాత్రం సిట్ ప్రస్తావించలేదు. న్యాయమూర్తికి ఏసీబీ 300 పేజీల ఛార్జ్ షీట్‌ను సిట్ సమర్పించింది. వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు జోడించింది. మొత్తం రూ.62 కోట్లు ఫ్రీజ్ చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో 268మంది సాక్ష్యులను విచారించినట్లు సిట్ చెప్పుకొచ్చింది. 11 మంది నిందితుల స్టేట్మెంట్ల నివేదికలను ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. బంగారం దుకాణాలు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొంది. షెల్ కంపెనీల ద్వారా మద్యం ముడుపులు, బ్లాక్ మనీని వైట్‌గా మార్చడం తదితర అంశాలను చార్జిషీట్లో సిట్ ప్రస్తావించింది. ఇదిలా ఉండగా.. మిథున్‌రెడ్డి ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు తోసిపుచ్చింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

