INDW vs ENGW | మెరిసిన మంధాన, దీప్తి.. ఇంగ్లండ్ ముందు స్వల్ప లక్ష్యం..!
INDW vs ENGW : తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది.
INDW vs ENGW : తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు షాకిచ్చిన భారత మహిళల జట్టు రెండో వన్డేలో భారీ స్కోర్ చేయలేకపోయింది. వర్షం కారణంగా ఓవర్లు కుదించిన మ్యాచ్‌లో స్మృతి మంధాన(42) చెలరేగినా.. మిడిలార్డర్ తేలిపోయింది. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బౌలర్లు చెలరేగగా ప్రధాన ప్లేయర్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మంధాన ఔటయ్యాక దీప్తి శర్మ (30), అరుంధతి రెడ్డి(14)లు పోరాడడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.
టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకొని.. తొలి వన్డేలోనూ ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత జట్టుకు వరుణుడు అడ్డుపడ్డాడు. లార్డ్స్‌లో వర్షం కారణంగా మ్యాచ్ సాయంత్రం 6 గంటలకు మొదలైంది. దాంతో, ఇరుజట్లకు 29 ఓవర్లు కేటాయించిన అనంతరం టాస్ గెలిచిన భారత కెప్టెన్ బ్యాటింగ్ తీసుకుంది. మొదటి వన్డేలో ధనాధన్ ఆడి శుభారంభం ఇచ్చిన ఓపెనర్లు ఈసారి నిరాశపరిచారు. ఎమా అర్లాట్ తన తొలి ఓవర్లోనే ప్రతీకా రావల్(3)ను బౌల్డ్ చేసి టీమిండియాకు షాకిచ్చింది. ఆరంభంలోనే వికెట్ పడినా స్మృతి మంధానా(42), హర్లీన్ డియోల్(16)లు బౌండరీలతో రెచ్చిపోయి స్కోర్‌బోర్డును పరుగెత్తించారు.
Innings Break!
Crucial knocks from Vice-Captain Smriti Mandhana (42) and Deepti Sharma (30*) help #TeamIndia set a target of 144 in front of England🎯
Over to our bowlers now!
Updates ▶️ https://t.co/ZeObbnYqoK#ENGvIND pic.twitter.com/oEwEoX9RhN
— BCCI Women (@BCCIWomen) July 19, 2025
రెండో వికెట్‌కు 40 రన్స్ జోడించిన వీళ్లను సోఫి ఎకిల్‌స్టోన్ విడదీసింది. డియోల్ తర్వాత వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(7)ను బౌల్డ్ చేసిన ఎకిల్‌స్టోన్ భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మంధాన ధాటిగా ఆడే ప్రయత్నం చేసింది. కానీ, జెమీమా రోడ్రిగ్స్(3), రీచా ఘోష్(2)లు పేలవ షాట్లు ఆడి పెవిలియన్ చేరారు. దాంతో, 72కే సగం వికెట్లు పడ్డాయి. ఆ దశలో గేర్ మార్చాలనుకున్న మంధానను లిన్సే స్మిత్ వెనక్కి పంపింది.
సహచరులు వరుసగా పెవిలియన్ చేరుతున్నా సరే దీప్తి శర్మ(30) సింగిల్స్, డబుల్స్‌లో జట్టు స్కోర్ 120 దాటించింది. బాధ్యతగా ఆడిన అరుంధతి రెడ్డి(14) పెద్ద షాట్‌కు యత్నించి లిన్సే ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది. ఆ కాసేపటికే స్నేహ్ రానా(6)ను అర్లాట్ బౌల్డ్ చేయడంతో ఎనిమిదో వికెట్ పడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 రన్స్ కొట్టింది హర్మన్‌ప్రీత్ సేన. ఇంగ్లండ్ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ మూడు వికెట్లు తీయగా.. లిన్సే, అర్లాట్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి
- Mithun Reddy | ఏపీ మద్యం స్కామ్.. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్..!
- ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు : మన్నె క్రిశాంక్
- Hansika | టాలీవుడ్ బ్యూటీ హన్సిక విడాకులు తీసుకోబోతుందా..? భర్త సోహైల్ భర్త ఏమన్నాడంటే..?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

