దుబాయ్: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదలపై నెలకొన్న సందిగ్ధతను తొలిగించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం సమావేశమవనుంది. వర్చువల్గా జరుగబోయే ఈ సమావేశంలో ప్రధానంగా షెడ్యూల్పైనే వాడివేడి చర్చ జరిగే అవకాశమున్నట్టు ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
డిసెంబర్ 1న బీసీసీఐ కార్యదర్శి జై షా.. ఐసీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో అంతకు రెండు రోజుల ముందే ఈ మీటింగ్ నిర్వహించనుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.