దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితుడయ్యాడు. ఆయన ఆస్ట్రేలియాకు చెందిన జెఫ్ అల్లార్డిస్ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. ఈ మేరకు ఐసీసీ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పాత్రికేయుడిగా కెరీర్ మొదలుపెట్టిన సంజోగ్.. 2010 నుంచి సుమారు దశాబ్దకాలం పాటు స్టార్లో పనిచేశాడు.
స్టార్లో పలు బాధ్యతల్లో పనిచేసిన ఆయన.. 2024లో డిస్నీ స్టార్, వయాకామ్ 18 మెర్జ్ అవడంతో జియోస్టార్కు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. కాగా ఐసీసీ సీఈవో స్థానానికి 25 దేశాల నుంచి సుమారు 2,500 అప్లికేషన్లు రాగా వీరిలో 12 మందిని షార్ట్ లిస్ట్ చేసిన ఐసీసీ.. సంజోగ్ను నియమిస్తున్నట్టు ప్రకటనలో తెలిపింది.