దుబాయ్: ఈ ఏడాది ఐసీసీ వార్షిక సమావేశాన్ని సింగపూర్‌లో నిర్వహించనున్నారు. ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక జై షా అధ్యక్షతన జరుగబోయే తొలి వార్షిక సమావేశమిదే. జూలై మూడో వారంలో జరిగే ఈ మీటింగ్‌లో.. ఇటీవలే ఐసీసీ క్రికెట్ కమిటీ సూచించిన పలు ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
వన్డే క్రికెట్లో 25వ ఓవర్ తర్వాత ఒకే బంతి వాడకంతో పాటు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో మాదిరిగానే టెస్టుల్లోనూ టైమ్ క్లాక్ (ఓవర్‌కు ఓవర్‌కు మధ్య నిడివి 60 సెకన్లకు మించకుండా) వినియోగంపై ఐసీసీ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అంతేగాక పురుషుల క్రికెట్లోనూ అండర్-19 టీ20 ప్రపంచకప్ నిర్వహణకూ గ్రీన్ సిగ్నల్ పడనున్నట్టు సమాచారం.