కొలంబో: ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (101 బ్యాటిం గ్) సెంచరీ చేయడంతో శ్రీలంకతో జరుగుతున్న ఏకైక టెస్టులో అఫ్గానిస్థాన్ పోరాడుతున్నది. అంతకుముందు లంక తొలి ఇన్నింగ్స్లో 439 పరుగులు చేయగా.. అఫ్గాన్ 198 రన్స్ కొట్టింది. రెండో ఇన్నింగ్స్లో అఫ్గాన్ బ్యాటర్లు పోరాట పటిమ చూపారు.
ఇబ్రహీంతో పాటు నూర్ అలీ (47), రహ్మత్ షా (46 బ్యాటింగ్) రాణించారు. చేతిలో 9 వికెట్లు ఉన్న అఫ్గాన్.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 42 పరుగులు వెనుకబడి ఉంది.