Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో ఓడిపోయిన ఓ బాక్సర్‌కు ఊహించని బహుమతి దక్కనుంది. ‘అబ్బాయితో నేను ఆడలేనంటూ’ వైదొలిగిన ఇటలీ అమ్మాయి ఎంజెల కరిని (Aagela Carini)కి అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (IBA) భారీ క్యాష్‌ప్రైజ్ ప్రకటించింది. ఆమెకు అండగా నిలిచిన ఐబీఏ రూ. 84 లక్షలు ప్రకటించింది.
‘ఒకవేళ ఎంజెలా పతకం గెలిచి ఉంటే.. ఆమెకు రూ.84 లక్షలు దక్కేవి. నేను ఎంజెలా ఏడ్వడం చూడలేకపోయాను. ప్రతి బాక్సర్ హక్కులు కాపాడడం మా బాధ్యత. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం మహిళా బాక్సింగ్‌ను ఎందుకు నాశనం చేస్తుందో నాకు ఆర్ధం కావడం లేదు. అర్హత గల బాక్సర్లు మాత్రమే రింగ్‌లోకి దిగాలి’ అని ఐబీఏ అధ్యక్షుడు ఉమర్ క్రెమ్లెవ్(Umar Kremlev) తెలిపాడు.
IBA will award Angela Carini, who abandoned the fight against Algeria’s Imane Khelif at Paris 2024 Games after 46 seconds of the first round, the IBA prize money as if she were an Olympic champion, President Umar Kremlev claimed. https://t.co/4mtBGpZk92
— IBA (@IBA_Boxing) August 2, 2024
బాక్సింగ్ 16వ రౌండ్లో అల్జీరియా బాక్సర్ ఇమనె ఖెలిఫ్ (Imane Khelif) ధాటికి ఎంజెలా కంగుతిన్నది. ‘రింగ్‌లో ఓ అబ్బాయి నన్ను కొడుతున్నాడు’ అంటూ ఆరోపిస్తూ.. భోరున ఏడ్చేసిన ఎంజెలా 46 సెకన్లకే
బౌట్ నుంచి తప్పుకుంది. దాంతో, ఆమెకు జరిగిన అన్యాయాన్ని తీవ్రంగా ఖండించిన ఐబీఏ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించని పరిస్థితుల్లో మ్యాచ్ నుంచి వైదొలిగిన ఆమెను విజేతగానే పరిగణించిన ఐబీఏ రూ. 84 లక్షలు ఇవ్వాలని తీర్మానించింది.
రింగ్‌లోనే ఏడుస్తున్న ఏంజెలను ఓదార్చుతున్న ఖెలిఫ్
పారిస్ ఒలింపిక్స్‌లో అల్జీరియాకు చెందిన ఇమనె ఖెలిఫ్, వియత్నాం బాక్సర్ లిన్ యు టింగ్(Lin You Ting)లు లింగ వివాదంలో చిక్కుకున్నారు. జండర్ టెస్టులో ఫెయిల్ అయిన వీళ్లిద్దరూ అమ్మాయిలు కాదంటూ ఐబీఏ ఆరోపిస్తోంది.
అయితే.. ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు థామస్ బాచ్ (Thamos Bach) మాత్రం అవన్నీ అబద్దాలంటూ కొట్టిపారేశాడు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన బాచ్.. ఇమనె ఖెలిఫ్, లిన్ యు టింగ్‌లు ఆడపిల్లగానే పుట్టారని, అందరు ఆడపిల్లల మాదిరిగానే పెరిగారని వెల్లడించాడు.
IOC President Thomas Bach responds to questions about the women’s boxing competition and makes it very clear there was never any doubt on the athletes being women, and that the current online abuse is unacceptable. pic.twitter.com/Xvd6SvtmQ5
— IOC MEDIA (@iocmedia) August 3, 2024