మాకు బతుకు చూపింది కేసీఆరే.. మా జీవితాల్లో వెలుగులు నింపిండ్రు
‘మాకు బతుకు చూపింది కేసీఆరే.. మా జీవితాల్లో వెలుగు నింపి.. తోవ చూపించిండు. ఆయన ఉన్నప్పుడే బాగుం డే’.. అని పలువురు మత్స్యకారులు అన్నారు.
- కాంగ్రెస్ వచ్చినంక ఏం బాగలేదు
- ఒక్క పథకం అమలు చేస్తలేదు
- సర్కార్ తీరుపై మాజీ మంత్రులు, ఎమ్మెల్యే ఎదుట మత్స్యకారుల ఆవేదన
గద్వాల, జనవరి 6 : ‘మాకు బతుకు చూపింది కేసీఆరే.. మా జీవితాల్లో వెలుగు నింపి.. తోవ చూపించిండు. ఆయన ఉన్నప్పుడే బాగుం డే’.. అని పలువురు మత్స్యకారులు అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు జూరాలను సందర్శించి కుడి కాలువ ను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు అక్కడున్న మత్స్యకారులతో మాట్లాడారు. ‘రోజూ కూలి ఎంత వ స్తుంది? అది కుటుంబానికి సరిపోతు న్నదా?’ అని అడిగారు. భార్యాభర్తలు కష్టపడితే రోజుకు రూ.500 రావడం కష్టంగా ఉందని వారు బదులిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పథకం కూడా సరిగ్గా ఇస్తలేదని చెప్పారు. పింఛన్లు పెంచి ఇస్తామని ఇవ్వడం లేదని, మహిళలకు రూ.2,500 కూడా ఇస్తలేదని వారు బీఆర్ఎస్ బృందం ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నా రు. కేసీఆర్ హయాంలోనే చేపలు పట్టేందుకు వలలు, విక్రయించేందుకు వాహనాలు అందించి తమకు బతుకు చూపారని గుర్తుచేసుకున్నారు. ఈ సారి ఎన్నికలు వస్తే కేసీఆర్‌కే ఓటేస్తామని చెప్పారు. రూ.2,500 ఇస్తే ఓటు ఎవరికి వేస్తారని శ్రీనివాస్‌గౌడ్ మత్స్యకార మహిళలను ప్రశ్నించగా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఓటు మాత్రం కేసీఆర్‌కేనని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

