BSNL – Jyotiraditya Scindia | బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్వర్క్ రెడీ.. ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి పెరుగుతున్న బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు..!
BSNL - Jyotiraditya Scindia | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
BSNL – Jyotiraditya Scindia | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) సబ్స్క్రైబర్ల పునాది క్రమంగా పెరుగుతున్నదని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ పరిధిలో 4జీ సేవలు అందుబాటులో ఉన్నాయని, దాన్ని 5జీ లోకి కన్వర్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర టెలికం శాఖ మంత్రి సింధియా శనివారం మీడియాతో చెప్పారు. ఆత్మ నిర్బర్ భారత్ (Atmanirbhar Bharat) ఇన్షియేటివ్ కింద స్వదేశీ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న 4జీ నెట్వర్క్ అందుబాటులో ఉందని తెలిపారు. త్వరలో బీఎస్ఎన్ఎల్ ద్వారా 4జీ సేవలు అందరికీ లభిస్తాయన్నారు.
‘రిలయన్స్ జియో, భారత్ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 4జీ నెట్ వర్క్ సేవలు అందుబాటులోకి తెస్తున్నప్పుడు బీఎస్ఎన్ఎల్ లో 4జీ నెట్వర్క్ ఎందుకు తేవడం లేదని పలువురు ప్రశ్నించారు. చైనా, ఏ ఇతర విదేశీ కంపెనీ పరికరాలు వాడకుండా దేశీయంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నెట్ వర్క్ అభివృద్ధి చేయాలని ప్రధాని నిర్ణయం తీసుకున్నారు’ అని సింధియా పేర్కొన్నారు. అందుకే స్వదేశీ పరిజ్ఞానంతోనే 4జీ నెట్వర్క్ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
తేజాస్ నెట్ వర్క్, సీ-డాల్, టీసీఎస్ వంటి భారతీయ సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా టవర్ల ఏర్పాటు ప్రక్రియ చేపట్టినట్లు సింధియా తెలిపారు. అక్టోబర్ కల్లా 80 వేలు, మరో 21 వేలు వచ్చే ఏడాది మార్చి కల్లా ఇన్ స్టాల్ చేస్తామని తెలిపారు. 2025 మార్చి కల్లా లక్ష ‘4జీ నెట్ వర్క్’ టవర్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. తద్వారా ఇంటర్నెట్ ద్వారా వేగంగా డేటా డౌన్ లోడ్, వాచింగ్ టెలివిజన్ తేలికవుతుందన్నారు. 4జీ నెట్వర్క్ పరిధిలోనూ 5జీ సేవలు వినియోగించుకోవచ్చునన్నారు. 5జీ సర్వీసుల కోసం టవర్లలో కొన్ని మార్పులు చేపట్టాల్సి ఉందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

