లక్నో: మైనర్ బాలుడు కారుతో స్టంట్ చేశాడు. (Kanpur Teen’s Car Stunt) అదుపుతప్పిన ఆ కారు ఒక స్కూటర్‌ను ఢీకొట్టింది. డ్రైవ్ చేసిన మహిళ మరణించగా, ఆమె కుమార్తె గాయపడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం 17 ఏళ్ల బాలుడు తన స్నేహితులతో కలిసి కారు డ్రైవ్ చేశాడు. ఈ సందర్భంగా బిజీ రోడ్డులో కారుతో స్టంట్ చేశాడు. వంద కిలోమీటర్ల వేగంతో కారును అడ్డంగా నడిపాడు.
కాగా, కారు స్టంట్ బెడిసికొట్టింది. అదుపుతప్పిన అది స్కూటర్‌పైకి దూసుకెళ్లింది. ఆ స్కూటర్‌ను డ్రైవ్ చేసిన మహిళ, వెనుక కూర్చొన్న ఆమె కుమార్తె గాలిలోకి ఎగిరిపడ్డారు. ఆ మహిళ హెల్మెట్ ధరించినప్పటికీ తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించింది. ఆమె కుమార్తె అయిన 12 ఏళ్ల బాలిక కూడా గాయపడింది. వారిద్దరూ స్కూటర్‌పై ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న కాన్పూర్ పోలీసులు మైనర్ బాలుడితోపాటు అతడి తండ్రిని అరెస్ట్ చేశారు. స్కూల్ ఎగ్టొట్టిన ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి కారుతో విన్యాసాలు చేసినట్లు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఆ కారులో ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని స్థానికులు తెలిపారు.
కాగా, కారు డ్రైవ్ చేసిన బాలుడ్ని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరో అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు అక్కడి నుంచి పారిపోయారు. స్కూటర్‌ను ఢీకొట్టడానికి ముందు పార్క్ చేసిన తన బైక్‌ను కూడా ఆ కారు ఢీకొట్టిందని ఒక వ్యక్తి తెలిపాడు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Location : Kanpur
It requires little practice to start a car.
But it requires a lot of effort to learn to drive safely.pic.twitter.com/cS7YNHkglq— DriveSmart🛡️ (@DriveSmart_IN) August 3, 2024