హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్టాత్మక ఐ-లీగ్ 2024-25 సీజన్లో రెండు విజయాల తర్వాత శ్రీనిధి డెక్కన్కు రెండో ఓటమి ఎదురైంది. డెక్కన్ ఎరీనా వేదికగా ఢిల్లీ ఎఫ్సీతో జరిగిన మ్యాచ్లో శ్రీనిధి.. 0-1తో పరాభవం పాలైంది. మ్యాచ్లో ఢిల్లీ తరఫున స్టీఫెన్ సమీర్ 71వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు. ఈ టోర్నీలో డిసెంబర్ 13న శ్రీనిధి.. డెంపొ ఎఫ్సీతో తలపడనుంది.