Virat Kohli | భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ.. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాక చాలా మారాడని వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తనకు 14 ఏండ్ల వయసున్నప్పట్నుంచి తెలుసునని, కానీ సారథ్యం వల్ల అతడి ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయని వ్యాఖ్యానించాడు. అయితే రోహిత్ శర్మ మాత్రం అలా కాదని, తనను కలిసిన తొలి రోజు ఎలా ఉన్నానో ఇప్పటికీ అతడితో అంతే జోవియల్‌గా ఉంటానని అన్నాడు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా మిశ్రా ఈ వ్యాఖ్యలు చేశాడు.
మిశ్రా మాట్లాడుతూ.. “భారత జట్టు సారథిగా నియమితుడయ్యాక విరాట్ చాలా మారిపోయాడు. మేము దాదాపు మాట్లాడుకోవడమే మానేశాం. ఒక వ్యక్తికి పేరు, ప్రతిష్టలు వచ్చినప్పుడు వాళ్లదగ్గరికి వచ్చేవాళ్లంతా ఏదో ఒక సాయాన్ని ఆశించి వస్తారని చాలా మంది భావిస్తారు. కానీ నేనైతే అలా కాదు. చీకూ (కోహ్లీ ముద్దుపేరు) నాకు 14 ఏండ్ల వయసున్నప్పట్నుంచీ తెలుసు. గతంలో అతడు సమోసాలు, రాత్రి పూట ఫిజ్జాలు ఎక్కువగా తినేవాడు. కానీ కెప్టెన్ అయ్యాక వాటన్నింటినీ పక్కనబెట్టాడు. కోహ్లీ నన్నెప్పుడు కలిసినా నాతో చాలా గౌరవంగా ఉంటాడు. కానీ నాకు తెలిసిన చీకూకు ప్రస్తుతం కోహ్లీకి చాలా తేడా ఉంది. నేను అబద్ధం చెప్పడం లేదు. ఒక క్రికెటర్‌గా కోహ్లీని నేను గౌరవిస్తాను. కానీ గతంలో అతడితో ఉన్నంత చనువుగా ఇప్పుడు ఉండలేను. అందుకే కోహ్లీకి జట్టులో కూడా చాలా తక్కువ మంది స్నేహితులుంటారు…
Amit Mishra Says “Rohit Sharma is the best guy in ICT, he sees every player equally he is like a big brother in ICT ❤️🫶” pic.twitter.com/0ovtDNy2bD
— ` (@cutxpull45) July 15, 2024
అయితే రోహిత్ మాత్రం అలా కాదు. రోహిత్, కోహ్లీ స్వభావాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. జట్టులో అందరితోనూ రోహిత్ ఇట్టే కలిసిపోతాడు. నేను అతడిని కలిసిన మొదటి రోజు ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉన్నాడు. అతడు ఏమాత్రం మారలేదు. నేను భారత జట్టులో లేక చాలాకాలమైంది. కానీ ఇప్పటికీ ఎక్కడ కలిసినా నాతో చాలా సరదాగా ఉంటాడు. నామీద జోకులేస్తాడు. పరిస్థితులకు అనుకూలంగా మారేవాళ్లకంటే ఎప్పటికీ ఒకేలా ఉండేవాళ్లతోనే నేను ఎక్కువగా కలిసిపోతాను..” అంటూ మిశ్రా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Dhoni, Sachin, Dravid, Rohit are legends and they get respect from masses. Chokli is also good player but he don’t get the respect as other legends get. His behaviour is big reason behind it.
– Amit Mishra pic.twitter.com/I0Ym3Kjo6H
— ` (@WorshipDhoni) July 15, 2024