ఢిల్లీ: బాక్సింగ్ దిగ్గజం, భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేశారని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను రాజీనామా చేయలేదని, పూర్తికాలం (2026 దాకా) పదవిలో కొనసాగుతానని స్పష్టం చేశారు.
ఇటీవల ముగిసిన జాతీయ క్రీడల ముగింపు వేడుకల సందర్భంగా తనకు కేటాయించిన హోటల్లో కలిగిన అసౌకర్యంపై ఆమె.. ఐవోఏ సిబ్బందితో చేసిన వాట్సాప్ చాట్ లీక్ అవడంతో కోమ్ రాజీనామా అంశం తెరపైకి వచ్చింది.