కోహ్లీ X బీసీసీఐ

- బోర్డు లక్ష్యంగా విరాట్ ఎదురుదాడి
- పలు కీలక అంశాలపై స్పష్టత
- గంటన్నర ముందు వన్డే కెప్టెన్సీపై సమాచారం
- బోర్డు నుంచి అలాంటి ప్రతిపాదన రాలేదు
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులోనే
- రోహిత్‌తో ఎలాంటి విభేదాల్లేవు
- వర్చువల్ మీడియా భేటీలో కోహ్లీ
భారత క్రికెట్ జట్టులో అలజడి! ఇన్నాళ్లు సాఫీగా సాగిన ప్రయాణంలో అనుకోని ఒడిదుడుకులు. నాయకత్వ బదిలీ విషయంలో ఏర్పడిన వివాదం చినికిచినికి గాలి వానలా మారుతున్న వైనం. వెరసి టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియా భేటీ బీసీసీఐలో ప్రకంపనలు సృష్టిస్తున్న వైనం. బోర్డు పెద్దల వైఖరి, వ్యవహారశైలిని దునుమాడుతూ విరాట్ ఖుల్లంఖుల్లా మాట్లాడాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేసిన విరాట్..టీ20 కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ బాస్ గంగూలీ వ్యాఖ్యలకు విరుద్ధంగా అసలు అలాంటి ప్రతిపాదన రాలేదన్నాడు. అంతటితో ఆగకుండా వన్డే కెప్టెన్సీపై గంటన్నర ముందు సమాచారమిచ్చి సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ తనదైన శైలిలో సమాధానం చెప్పుకొచ్చాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్‌శర్మతో ఎలాంటి విభేదాల్లేవని చెప్పిచెప్పి అలసిపోయానన్న కోహ్లీ.. జట్టు ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేశాడు. బుధవారం వర్చువల్ మీడియా భేటీలో కోహ్లీ పలు అంశాలపై స్పష్టతనిచ్చాడు.
న్యూఢిల్లీ/ముంబై: సుదీర్ఘ భారత క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ చోటు చేసుకోని సందర్భం. నాయకత్వ మార్పిడి విషయంలో అవలంభించిన బోర్డు వైఖరిని ఎండగడుతూ టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ దిమ్మతిరిగే రీతిలో కౌంటర్ ఇచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటన కోసం బుధవారం బయల్దేరి వెళ్లడానికి ముందు కెప్టెన్ హోదాలో కోహ్లీ వర్చువల్ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై స్పష్టత ఇచ్చాడు. ఇందులో టీ20 కెప్టెన్సీకి రాజీనామా, వన్డే నాయకత్వం నుంచి తొలగింపు, రోహిత్‌శర్మతో విభేదాలు, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ నుంచి విరామం, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలకు విరాట్ విరుద్ధంగా స్పందించిన తీరు అతని మాటల్లోనే..
గంటన్నర ముందు చెప్పారు..
ఈనెల 8న దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక కోసం సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్న విషయం..సెలెక్టర్ల సమావేశానికి సరిగ్గా గంటన్నర ముందు చెప్పారు. అంతకుమించి నాకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగినప్పటి నుంచి నాతో బోర్డు తిరిగి మాట్లాడింది లేదు. టెస్టు జట్టు ఎంపికపై చీఫ్ సెలెక్టర్ చేతన్‌శర్మ నిర్ణయంతో నేను ఏకీభవించాను. అయితే ఐదుగురు సెలెక్టర్లు వన్డే కెప్టెన్సీ విషయంలో నన్ను తప్పిస్తున్నట్లు చెప్పారు. దానికి నేను ‘ఓకే ఫైన్’ అని సమాధానిమిచ్చాను. సెలెక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఏం జరిగిందన్న దానిపై మేం చాటింగ్ ద్వారా చర్చించుకున్నాం.
అసలు అలాంటి ప్రతిపాదన రాలేదు
- టీ20 కెప్టెన్సీ విషయంలో నేను తప్పుకుంటానంటే బోర్డు పెద్దలు వద్దని వారించినా.. వినలేదనేది తప్పు. అసలు అలాంటి ప్రతిపాదన వారి నుంచి రాలేదు. నేను తీసుకున్న నిర్ణయంపై బోర్డు నుంచి వచ్చిన స్పందన సరైంది కాదు. టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి ఎందుకు తప్పుకుంటునన్న విషయంపై బోర్డుకు ముందే వివరించాను. ఆఫీస్ బేరర్ల ముందు రాజీనామా విషయంలో నా నిర్ణయమిదని చెప్పాను. దానికి గల కారణాలు చెప్పాను. నేను చెప్పిన దాన్ని వారు బాగా స్వీకరించారు. ఎలాంటి భిన్నాభిప్రాయాలు రాలేదు, ఎందుకు వైదొలుగుతున్నావనే ప్రశ్న కూడా ఉత్పన్నం కాలేదు. వద్దని వారించిన దాఖలాలు కూడా లేవు.
2023 వరకు కెప్టెన్‌గా కొనసాగుదామనుకున్నా
- స్వదేశం వేదికగా 2023లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు వన్డే కెప్టెన్‌గా కొనసాగుదామనుకున్నాను. టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు సమయంలో బోర్డుకు ఇదే విషయం చెప్పాను. అయితే కెప్టెన్‌గా కొనసాగే విషయంలో ఆఫీస్ బేరర్లు, సెలెక్టర్లకు మరో ఉద్దేశం లేనంత వరకు ఓకే చెప్పాను. ఒకవేళ కెప్టెన్సీ మార్పు విషయంలో వారు వేరే ఆలోచనతో ఉంటే అది మీ చేతుల్లోనే ఉందని చెప్పాను.
రోహిత్‌తో విభేదాల్లేవు
- రోహిత్‌శర్మకు నాకు ఎలాంటి విభేదాల్లేవు. గత రెండున్నరేండ్లలో ఈ విషయంలో స్పష్టత ఇచ్చి ఇచ్చి అలసిపోయాను. జట్టులో నేను ఆడేంత వరకు నా వల్ల ఎలాంటి ఇబ్బందులు రావన్న గ్యారంటీ ఇవ్వగలను. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెట్‌పై నాకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. కెప్టెన్ కాకముందు నుంచి కూడా ఇదే దృక్పథంతో ఉన్నాను.
రోహిత్, రాహుల్‌కు పూర్తి మద్దతు
- రోహిత్ కెప్టెన్సీ విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. భారత్‌కు నాయకత్వం వహించడంతోపాటు ఐపీఎల్‌లోనూ అతను రాణించిన తీరు చూశాం. జట్టు అవసరాల కోసం కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌కు అన్ని రకాలుగా వందశాతం మద్దతుగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను.
వన్డేలకు అందుబాటులో ఉంటాను
- ప్రతిసారి నేను సెలెక్షన్స్‌కు అందుబాటులో ఉంటాను. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం విశ్రాంతి కావాలని బీసీసీఐని నేను ఎప్పుడు అడగలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

