న్యూఢిల్లీ: కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత ప్యాడ్లర్లు అన్ని విభాగాల్లోనూ సెమీఫైనల్ చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ 4-0 (13-11, 11-4, 11-9, 12-10)తో ఇంగ్లండ్‌కు చెందిన టిన్ టిన్ హోను చిత్తు చేయగా, యశస్విని ఘోర్పడే 4-0తో ఆస్ట్రేలియా ప్యాడ్లర్ కాన్స్టాంటినాను ఓడించింది.
సిండ్రెలా దాస్ 4-2తో టాప్ సీడ్ ఆస్ట్రేలియా ప్లేయర్ యాంగ్జీ ల్యూకు షాకివ్వగా.. సుతీర్థ ముఖర్జీ 4-1తో మిన్ హ్యుంగ్ జీ (ఆస్ట్రేలియా)ని ఓడించింది. పురుషుల క్వార్టర్స్‌లో టాప్ సీడ్ మానుష్ షా 4-2తొ ఆదిత్య సరీన్ (ఆస్ట్రేలియా)ను ఓడించి ముంద ంజ వేయగా.. పయాస్ జైన్, అంకుర్ భట్టాచార్జీ, మానవ్ ఠక్కర్ కూడా సెమీస్‌లో అడుగుపెట్టారు.