జాదవ్‌పూర్: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. శనివారం గ్రూపు-బీలో జరిగిన పోరులో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో బీహార్‌పై ఘన విజయం సాధించింది.
బీహార్ నిర్దేశించిన 133 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ 12.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. తొలుత తనయ్ త్యాగరాజన్(3/21) ధాటికి బీహార్ 20 ఓవర్లలో 132/8 స్కోరు చేసింది. పియూశ్సింగ్(34) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు