జమ్మూ : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు తొలి ఓటమి దిశగా సాగుతున్నది. జమ్మూకాశ్మీర్‌తో జరుగుతున్న గ్రూప్-డీ ఐదో మ్యాచ్‌లో ఆ జట్టు నిర్దేశించిన 472 పరుగుల ఛేదనలో భాగంగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్.. 52.3 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
ప్రధాన బ్యాటర్లంతా నిష్క్రమించిన వేళ హైదరాబాద్ ఓటమిని అడ్డుకోవడం లోయరార్డర్కు శక్తికి మించిన పనే కానుంది.