హైదరాబాద్, ఆట ప్రతినిధి: మూలపాడు (ఆంధ్రప్రదేశ్) వేదికగా జరుగుతున్న బీసీసీఐ మహిళల అండర్-23 సీనియర్ వన్డే టోర్నీలో హైదరాబాద్‌కు ఓటమి ఎదురైంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 246 పరుగులు చేసింది.
గొంగడి త్రిష(65), త్రిష పూజిత(57) అర్ధసెంచరీలతో రాణించారు. ఆర్చనాదేవి(5/47) ఐదు వికెట్లతో విజృంభించింది. లక్ష్యఛేదనలో యూపీ 49.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. శోభాదేవి(97) అర్ధసెంచరీతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించింది.