హైదరాబాద్, ఆట ప్రతినిధి: రంజీ ఎలైట్ విభాగంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆ జట్టు 565 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరు 291/2తో రెండో రోజు శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన హైదరాబాద్.. అదే జోరును కొనసాగించింది.
తన్మయ్ అగర్వాల్ (177) భారీ ఇన్నింగ్స్ ఆడగా హిమతేజ (76), రక్షణ్ (42 నాటౌట్) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో వశిష్ట్ (4/92) నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్.. ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న హిమాచల్ ప్రదేశ్ 532 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నది.